చాణక్య మూవీ అప్ డేట్స్

Friday,August 30,2019 - 04:32 by Z_CLU

గోపీచంద్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `చాణక్య‌`. తిరు ద‌ర్శ‌క‌త్వంలో ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా టాకీ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పాటల చిత్రీకరణలో ఉంది.

ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ రాజు సుంద‌రం నేతృత్వంలో ఇట‌లీ, మిలాన్‌లో పాట‌ల‌ను చిత్రీక‌రిస్తున్నారు. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెట్రి కెమెరామెన్‌. సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారు.

సాంకేతిక వర్గం:
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తిరు
ప్రొడ్యూసర్: రామబ్రహ్మం సుంకర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గిరికిపాటి
కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర
మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి
రైటర్: అబ్బూరి రవి
ఆర్ట్: రమణ వంక
కో డైరెక్టర్: దాసం సాయి, రాజ్ మోహన్