ఇద్దరమ్మాయిలతో హైలెట్స్

Friday,October 07,2016 - 01:21 by Z_CLU

  • మొదట ఈ సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా తాప్సిని అనుకున్నారు. తర్వాత రిచా గంగోపాధ్యాయను సెలక్ట్ చేశారు. ఫైనల్ గా క్యాథరీన్ థ్రెసాను తీసుకున్నారు. అలా ఇద్దరమ్మాయిలతో సినిమాతో క్యాథరీన్ తెలుగులో స్టార్ అయిపోయింది

  • ఈ మూవీకి మొదట చక్రిని మ్యూజిక్ డైరక్టర్ గా అనుకున్నారు. ఎందుకంటే చక్రి అంటే పూరి జగన్నాధ్ కు మంచి గురి. కానీ తొలిసారిగా దేవిశ్రీప్రసాద్ – పూరి కలిసి ఈ సినిమాకు వర్క్ చేశారు.

  • iddarammayilatho-latest-stills-13

  • పాప్ అండ్ రెగ్గీ సింగర్ అపాచీ ఇండియన్… ఫస్ట్ టైం ఈ సినిమాతోనే తెలుగుతెరకు పరిచయం అయ్యాడు. అపాచీ ఇండియన్ పాడిన రన్-రన్ అనే మొదటి తెలుగు పాట ఇద్దరమ్మాయిలు సినిమాలోనిదే..

  • సినిమా రిలీజ్ కు ముందే ఇద్దరమ్మాయిలతో వయొలిన్ సాంగ్ ట్యూన్ పెద్ద హిట్. సినిమా రిలీజ్ అవ్వకముందే ఈ సాంగ్ బిట్ తో లక్షల్లో కాలర్ ట్యూన్స్, రింగ్ టోన్స్ వచ్చేశాయి. అప్పట్లో అదో పెద్ద రికార్డు. కేవలం ఈ సాంగ్ కోసం సినిమా కోసం ఎదురుచూశారు సంగీత ప్రియులు.

  • 4_261_685_iddarammayilatho-movie-working-stills-3

  • ఇక సినిమాలో ఓ కీలకమైన సీన్ కోసం ఓ రోజంతా కేటాయించాడు పూరి జగన్నాధ్. ఉదయం 11 గంటలకు షాట్ స్టార్ట్ చేసి, అవసరమైతే ఎన్ని టేకులైనా తీసుకొని సాయంత్రం లోపు ఆ షాట్ కంప్లీట్ చేయాలనుకున్నారు. కానీ బన్నీ సింగిల్ టేక్ లో ఆ షాట్ ఓకే చేశాడు. దీంతో మిగిలిన టైం అంతా యూనిట్ ఫుల్లుగా ఎంజాయ్ చేసింది.

  • కెరీర్ లోనే ఫస్ట్ టైం ఇద్దరు హీరోయిన్లతో కలిసి బన్నీ నటించిన సినిమా ఇది. (అంతకు ముందు ఆర్య-2లో కాజల్ తో పాటు శ్రద్ధాదాస్ నటించినా కథ పరంగా అది సెకెండ్ హీరోయిన్ కిందకు రాదు.)