హాలీడేస్ హంగామా

Friday,October 07,2016 - 12:44 by Z_CLU

పెళ్లి తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన నమ్రతా శిరోద్కర్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి పర్ ఫెక్ట్ పార్ట్ నర్. ఎప్పుడు చూసినా పిల్లల ఆలనా పాలనతో బిజీగా ఉండే నమ్రత, సితార చేస్తున్న అల్లరిని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

super-star-mahesh-babu-daughter-sitara2

పిల్లలకు దసరా సెలవులు దొరకడంతో హాలీడేస్ ని ప్లాన్ చేసినట్టుంది నమ్రత. పిల్లలతో హాలీడేస్ ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంది. కూతురు సితార… చాక్లెట్, పిజ్జా తయారుచేస్తున్న స్టిల్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పైగా ఈ గ్యాంగ్ అక్కడ ఉన్న చాక్లెట్ లన్నింటినీ తినేసింది అని మురిసిపోతూ కామెంట్ కూడా పెట్టింది నమ్రత.

mahesh-kuthuru

సినిమా సినిమాకి మధ్య కంపల్సరీగా ఓ ఫ్యామిలీ బ్రేక్ తీసుకుని హాలీడేస్ ప్లాన్ చేసే మహేష్ బాబు, తన బిజీ షెడ్యూల్ వల్ల ఈసారి ఫ్యామిలీ ఎంజాయ్ మెంట్ ను మిస్ అయ్యాడు.