పోలా... అదిరిపోలా...

Friday,October 07,2016 - 01:41 by Z_CLU

ఒక స్టార్ సినిమా రిలీజ్ అయి వారం గడుస్తుందో లేదో, ఫ్యాన్స్ నెక్స్ట్ సినిమా అనౌన్స్ మెంట్ ఎప్పుడా అని ఎదురు చూడటం మొదలుపెట్టేస్తారు. అదీ జరిగాక ఫోకస్ ఫస్ట్ లుక్ పై పడుతుంది. ఫ్యాన్స్ ఓపిక నశించే లోపు అది కూడా రిలీజ్ అయితే సరే సరి… లేదా ఫ్యాన్ మేడ్ పోస్టర్ లని, లేకపోతే ఏకంగా లోగో లీకయిందని రకరకాల రూమర్లు వచ్చేస్తాయి. ఇప్పుడు బన్నీ ఫస్ట్ లుక్ పై కూడా అదే జరుగుతుంది.

duvvada-jagannadam-new-look

హరీష్ శంకర్ దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి రానున్న DJ (దువ్వాడ జగన్నాథం) సినిమాలో బన్నీ లుక్ డిఫెరెంట్ గా ఉండబోతుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్న అభిమానుల కోసం ఓ ఫోటో లీకైంది. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఉన్న బన్నీ స్టిల్ ఒకటి నెట్ లో హల్ చల్ చేస్తుంది. అదే DJ లో బన్నీ లుక్ అయి ఉంటుంది అని అభిమానుల స్ట్రాంగ్ ఫీలింగ్.

allu-arjun-dj-movie-opening-new-look-1

ఈ సినిమాని అల్లు అరవింద్, దిల్ రాజు సయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాత దిల్ రాజు కు ఇది 25 వ సినిమా కావడం విశేషం.