ఉగాది నుండి నాని – నాగార్జునల మల్టీస్టారర్

Monday,March 12,2018 - 02:45 by Z_CLU

నాని, నాగార్జున హీరోలుగా తెరకెక్కనున్న మల్టీస్టారర్ ఈ ఉగాది నుండి సెట్స్ పైకి రానుంది. మ్యాగ్జిమం ప్రీ ప్రొడక్షన్ కి ప్యాకప్ చెప్పేసిన ఫిల్మ్ మేకర్స్, ప్రస్తుతం U.S. లో మ్యూజిక్ సిట్టింగ్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

మార్చి 18 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా. టాలీవుడ్ లో 2 డిఫెరెంట్ ఇమేజ్ ఉన్న ఈ స్టార్ హీరోలను శ్రీరామ్ ఆదిత్య ఎలా ప్రెజెంట్ చేయనున్నాడోనన్న క్యూరాసిటీ, ఈ సినిమా చుట్టూ ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది.

ప్రస్తుతం నాగార్జున సరసన హీరోయిన్ ని ఫిక్స్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్న సినిమా యూనిట్, నాని సరసన రకుల్ ని ఆల్ రెడీ ఫిక్స్ చేసుకున్నారనే టాక్ గట్టిగానే వినిపిస్తుంది. ఈ సినిమాని  వైజయంతి ఫిల్మ్ బ్యానర్ పై అశ్వనీ దత్ నిర్మిస్తున్నాడు.