బాలయ్య, వినాయక్ సినిమాకు డేట్ ఫిక్స్?

Monday,May 21,2018 - 11:15 by Z_CLU

లెక్కప్రకారం, ఎన్టీఆర్ బయోపిక్ సెట్స్ పైకి రావాలి. కానీ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కావడంతో ఇంకాస్త టైమ్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు బాలయ్య. ఈ గ్యాప్ లో మరో సినిమా పూర్తిచేయబోతున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈనెల 25 లేదా 27న బాలయ్య, వినాయక్ కాంబోలో కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.

ఇప్పటికే బాలయ్య, వినాయక్ మధ్య స్టోరీ డిస్కషన్లు పూర్తయ్యాయి. అఫీషియల్ గా సినిమాను ఎనౌన్స్ చేయడమే ఆలస్యం. రీసెంట్ గా బాలయ్యతో జై సింహా సినిమా తీసిన సి.కల్యాణ్.. ఈ కాంబినేషన్ ను తెరపైకి తీసుకొస్తున్నాడు.

గతంలో బాలకృష్ణ, వినాయక్ కాంబోలో చెన్నకేశవరెడ్డి సినిమా వచ్చింది. తర్వాత మళ్లీ ఇద్దరూ కలిసి వర్క్ చేయలేదు. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. చెన్నకేశవరెడ్డిలో బాలయ్య సరసన నటించిన శ్రియనే.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కూడా హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట. రీసెంట్ గా బాలయ్య-శ్రియ కలిసి గౌతమీపుత్ర శాతకర్ణి, పైసావసూల్ సినిమాలు చేశారు.