రాశిఖన్నా ఇంటర్వ్యూ

Wednesday,February 07,2018 - 06:19 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది రాశిఖన్నా. ఈ నెల 10 న రిలీజ్ అవుతున్న తొలిప్రేమ మూవీ తనకెంతో స్పెషల్ అని ఫీల్ అవుతున్న రాశిఖన్నా, ఈ సినిమా గురించి బోలెడన్నీ ఎగ్జైటింగ్ విషయాలు షేర్ చేసుకుంది. అవి మీకోసం…

అందుకే అంత స్పెషల్…

తొలిప్రేమ సినిమా వెరీ క్లోజ్ టు మై హార్ట్. సినిమాల్లో మామూలుగా హీరోయిన్స్ పర్ఫామెన్స్ కి అంత స్కోప్ ఉండదు. కానీ ‘ఊహలు గుసగుసలాడే’ తరవాత మళ్ళీ అంత స్కోప్ ఉన్న సినిమా తొలిప్రేమ. నాకు లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. ఆ మ్యాజిక్ స్క్రీన్ పై వర్కవుట్ అవుతుందనే అనుకుంటున్నాను.

 

అది వేరు.. ఇది వేరు…

నేను పాత ‘తొలిప్రేమ’ సినిమా చూశాను. అందులో నాకు హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ అంటే చాలా ఇష్టం. అసలు ఆ తొలిప్రేమ సినిమాకు, ఈ తొలిప్రేమ సినిమాకు అసలు సంబంధం ఉండదు. ఇది ఈ జెనేరేషన్ ఆటిట్యూడ్స్ కి చాలా క్లోజ్ గా ఉంటుంది.

కంపేర్ చేయలేం….

ఈ తొలిప్రేమలో కూడా నా ఇంట్రడక్షన్ బావుంటుంది కానీ, దాన్ని దీన్ని అసలు కంపేర్ చేయలేం…

హ్యాప్పీగా ఉంది…

సినిమాలో 3 షేడ్స్ లో కనిపిస్తాము నేను, వరుణ్ తేజ్. ఏడెనిమిదేళ్ళ జర్నీ ఉంటుంది సినిమాలో. జస్ట్ పర్ఫామెన్స్ విషయంలోనే కాకుండా బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నాం. యంగ్ ఏజ్ స్టోరీలో నేను స్పెట్స్  పెట్టుకుని మేకప్ లేకుండా కనిపిస్తాను. దానికి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరూ నన్ను హ్యారీ పోటర్ కి యంగర్ సిస్టర్ లా ఉన్నావు అంటున్నారు.

చాలెంజింగ్ అనిపించింది…

సినిమాలో చాలా ఇమోషనల్ సీన్స్ ఉన్నాయి. నాకు వరుణ్ తేజ్ కి మధ్య ఉండే కొన్ని సీన్స్ చాలా హార్ట్ టచింగ్ గా ఉంటాయి. లవ్ స్టోరీ కాబట్టి చాలా సీన్స్ మా ఇద్దరి కాంబినేషన్ లో ఉంటాయి.

ఒక్కోసారి ఏడ్చేశాను…

వరుణ్ తేజ్ చాలా డెడికేటెడ్ యాక్టర్. బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ విషయంలో అయితే చాలా కష్టపడ్డారు. ఆయన పర్ఫామెన్స్ కి,  ఒక్కోసారి  నా కళ్ళల్లో నీళ్ళు తిరిగేవి. అంత న్యాచురల్ గా పర్ఫామ్ చేస్తాడు.

అంతా తొలిప్రేమ కోసమే…

19 ఏళ్ల క్యారెక్టర్ చేసినప్పుడు నేను కొంచెం బొద్దుగా కనిపించాలి అన్నారు, అందుకోసం లావయ్యాను. ఆ తరవాత లండన్ లో షూట్ చేశాం. ఆ సీక్వెన్సెస్ కోసం తగ్గాను. ఆ షూట్ తరవాత  కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉండే సీక్వెన్సెస్ కోసం మరింత బరువు తగ్గాల్సి వచ్చింది. నాకు వరుణ్ తేజ్ కి సేమ్ ట్రైనర్. 15 రోజుల పాటు స్ట్రిక్ట్ టైనింగ్ చేశాం. 2 నెలల్లో 5 కిలోలు తగ్గాను. ఈ సినిమాకి ఎక్కువగా కష్టపడ్డాను కాబట్టే ఈ సినిమా నాకు చాలా స్పెషల్.

 

వెంకీ అట్లూరి…

డైరెక్టర్ వెంకీ ఈ సినిమాపై దాదాపు 2 ఇయర్స్ గా పని చేస్తున్నారు. అందుకే ఆయనకు సినిమాపై కంప్లీట్ గా క్లారిటీ ఉంది. చాల హార్డ్ వర్కింగ్ ఆటిట్యూడ్.

అందుకే నేను కనెక్ట్ అయ్యాను…

నేను కూడా నా 17 ఏళ్ల వయసులో లవ్ లో పడ్డాను. తనే నాకు ప్రపోజ్ చేశాడు. సినిమాలో కూడా అలాంటి సీన్ ఉంటుంది. అందుకే నేను చాలా కనెక్ట్ అయ్యాను. ప్రతి అమ్మాయి కనెక్ట్ అవుతుంది సినిమాకి…

అదే నా ఫేవరేట్ సీన్…

మూవీ లో కార్ లో ఒక రొమాంటిక్ సీన్ ఉంటుంది, చాలా క్యూట్ గా ఉంటుంది ఆ సీన్. అది నా మోస్ట్ ఫేవరేట్ సీన్….

చాలా హ్యాప్పీగా ఉంది…

సోషల్ మీడియాలో కూడా నా లుక్ కి చాలా  మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ నా  స్టిల్స్ ని, హ్యారీ పోటర్ స్టిల్స్ ని పోస్ట్ చేస్తూ, కామెంట్స్ పెట్టారు. చాలా హ్యాప్పీగా ఉంది.

నెక్స్ట్ మూవీస్….

తమిళ్ లో 3 సినిమాలు చేస్తున్నాను. సిద్ధార్థ్ తో చేసిన మూవీ  ఏప్రియల్ లో రిలీజ్ అవుతుంది. ‘అథర్వ’ కూడా షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ సినిమాలో నయనతార, అనురాగ్ కశ్యప్ కూడా నటించారు. జయం రవి తో చేస్తున్న  సినిమా షూటింగ్ బిగిన్ అయింది. ఈ సినిమా మే లో రిలీజ్ అవుతుంది. తెలుగులో ఇంకో సినిమా ఉంటుంది ఆ డీటేల్స్ ఇంకో 3 డేస్ లో అనౌన్స్ చేస్తారు.