వినాయక్ ఆ హీరోతోనే ?

Sunday,August 04,2019 - 12:54 by Z_CLU

నరసింహ రావు డైరెక్షన్ లో హీరోగా సినిమా చేయబోతున్నాడు వినాయక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా కోసం బరువు తగ్గే పనిలో ఉన్నాడు స్టార్ డైరెక్టర్. అయితే ఈ సినిమాను ఓ మూడు నెలల్లో ఫినిష్ చేయాలని చూస్తున్నాడు వినాయక్.

హీరోగా చేస్తున్న సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి నెక్స్ట్ రవితేజ తో సినిమా చేయాలనే ఆలోచలో ఉన్నాడట వినాయక్. ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా జరుగుతున్నాయంటున్నారు. అన్ని కుదిరితే వచ్చే ఏడాది జనవరిలో సినిమా స్టార్ట్ అవ్వొచ్చని తెలుస్తోంది. ఈ కాంబినేషన్ సినిమాను నల్లమలపు బుజ్జి నిర్మిస్తాడని టాక్.