ముచ్చటగా మూడోసారి

Thursday,November 17,2016 - 11:30 by Z_CLU

ఒక జంట ఓ సినిమాతో సూపర్ హిట్ అందుకుందంటే వారిద్దరి కాంబినేషన్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చెయ్యడానికి రెడీ అవుతారు దర్శకనిర్మాతలు. ప్రస్తుతం అలాంటి హిట్ కాంబో మరో సినిమాతో రెడీ అయిపోయింది. వారిద్దరూ ఎవరో? కాదు ‘కుమారి 21 ‘ ఎఫ్ సినిమాతో సూపర్ హిట్ అందుకొని హిట్ కాంబో గా గుర్తింపు అందుకున్న రాజ్ తరుణ్, హెబ్బా పటేల్.

    ‘కుమారి 21 ఎఫ్’ తో తొలిసారిగా కలిసి నటించిన వీరిద్దరూ ఇటీవలే ‘ఈడో రకం ఆడోరకం’ సినిమాలో మరోసారి కలిసి నటించి ఇంకో హిట్ అందుకున్నారు. ఇక ముచ్చటగా మూడో సారి ప్రేక్షకులను అలరించి మరో సూపర్ హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నారు. వీరిద్దరి కాంబో లో తెరకెక్కుతున్న మూడో చిత్రానికి ‘అందగాడు’ అనే టైటిల్ ను ఖరారు చేశారు మేకర్స్. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.10గా రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను వ‌చ్చే ఏడాది వేస‌వి సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.