విక్రమ్ సరసన అనుష్క, తమన్నా..?

Thursday,November 17,2016 - 12:07 by Z_CLU

సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో తెలుగు-తమిళ భాషల్లో సక్సెస్ అందుకున్న గౌతమ్ మీనన్… త్వరలోనే విక్రమ్ తో సినిమా చేయబోతున్నాడు. సాహసం శ్వాసగా సాగిపో ప్రమోషన్ లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన గౌతమ్.. ఈ విషయాాన్ని స్పష్టంచేశాడు. అయితే విక్రమ్ సినిమా ఇంకా డిస్కషన్ స్టేజ్ లోనే ఉందని… ఇంకా ఫైనలైజ్ కాలేదని అంటున్నాడు.

collage3

ఒకవేళ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ వస్తే కనుక ఇందులో అనుష్క, తమన్న హీరోయిన్లుగా నటించే అవకాశం ఉందని అంటున్నాడు గౌతమ్ మీనన్. ఎందుకంటే… విక్రమ్ కంటే ముందే ఈ స్టోరీలైన్ గురించి అనుష్క, తమన్నాలతో చర్చించాడట గౌతమ్. ప్రాజెక్టు కనుక ఓకే అయితే విక్రమ్-తమన్న కాంబినేషన్ లో ఇదే ఫస్ట్ మూవీ అవుతుంది.