ఆ ఫంక్షన్ కు సూపర్ స్టార్ వెళ్తున్నాడు...

Thursday,November 17,2016 - 10:10 by Z_CLU

మరో మూడు రోజుల్లో 2.0 సినిమా వేడుక ప్రారంభం కానుంది. రజనీకాంత్ నటించిన రోబో సినిమాకు సీక్వెల్ గా  2.0ను తెరకెక్కిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ ను ఈ ఆదివారం ముంబయిలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. అయితే ఈ ఫంక్షన్ కు రజనీకాంత్ వెళ్లడంటూ మొన్నటివరకు పుకార్లు వచ్చాయి. అదే సమయానికి సూపర్ స్టార్ అమెరికా వెళ్లి ట్రీట్ మెంట్ తీసుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదంటోంది యూనిట్. ముంబయిలో ఆదివారం జరిగే ఫస్ట్ లుక్ రిలీజ్ వేడుకకు రజనీకాంత్ వస్తారని స్పష్టంచేసింది. యష్ రాజ్ స్టుడియోలో సాయంత్రం 5 గంటలకు ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి రజనీకాంత్ తో పాటు… 2.0లో విలన్ గా నటిస్తున్న అక్షయ్ కుమార్ కూడా హాజరవుతాడు. ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్… ఈ ఫస్ట్ లుక్ లాంచింగ్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడు.