ఇదే సమాంత లాస్ట్ రీమేక్...

Friday,July 05,2019 - 10:02 by Z_CLU

ఇకపై సమాంత రీమేక్ చేయదు… ఈ స్టేట్ మెంట్ సమాంత స్వయంగా ‘హే.. బేబీ’ ప్రమోషన్స్ లో చెప్పుకుంది. ఈ మధ్య వరసగా రీమేక్స్ పై దృష్టి పెట్టిన సమాంత ఇకపై రీమేక్స్ చేయకూడదని ఫిక్సయింది. 

సమంతా గతంలో చేసిన ‘యూ టర్న్’ లో సమంతా పర్ఫామెన్స్ కి మంచి అప్లాజ్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా అదే స్థాయిలో నిలబడలేదు. నిజానికి కన్నడలో ఈ సినిమా చూసి ఇంప్రెస్ అయిన సమాంత, దర్శకుడు పవన్ కుమార్ కి, తెలుగు, తమిళంలో రీమేక్ చేస్తానని ఎదురెళ్ళి ఆఫర్ ఇచ్చింది.

ఇప్పుడు ‘హే బేబీ’ విషయంలో కూడా అంతే.. కొరియన్ సినిమా ‘మిస్ గ్రానీ’ చూసి నందిని రెడ్డి చేత ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకు వచ్చింది. సమాంత ఆలోచనకి నిర్మాత సురేష్ బాబు కూడా జతై, ఈ సినిమా అఫీషియల్ రైట్స్ కొనుగులు చేసేసరికి ఈజీగా సినిమా పట్టాలెక్కేసింది.. దాంతో ఈ వరసలో సమాంత ఈ మధ్య మరీ రీమేక్సే చేస్తుందనే అబిప్రాయం ఫ్యాన్స్ లో జెనెరేట్ అవుతుంది.

ఈ లెక్కన సమాంత కరియర్ లో ఉన్న రీమేక్స్ కి ఫస్ట్ ఎవర్ డెసిషన్ మేకర్ సమంతానే. ఈ రీమేక్స్ బిజీలో స్టార్ హీరో సినిమాలకు దూరమవుతున్నాననే ఫీలింగ్ తో కొన్ని రోజులు, రీమేక్స్ ని పక్కన పెట్టి కంప్లీట్ గా ఫుల్ ఫోకస్ ఒరిజినల్ స్టోరీస్ పై పెట్టాలని ఫిక్సయిందీ బేబీ..