‘ఇస్మార్ట్ శంకర్’ లో నిధి అగర్వాల్ కీ రోల్...

Friday,July 05,2019 - 11:02 by Z_CLU

‘ఇస్మార్ట్ శంకర్’ లో ఇద్దరు హీరోయిన్స్. అయితే అందులో నిధి అగర్వాల్ రోల్ మరింత స్పెషల్ గా ఉండబోతుంది.  అందుకే ఈ క్యారెక్టర్ ని రివీల్ చేసే విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు మేకర్స్.  ట్రైలర్ లో చూపించినట్టు  హీరో తలలో పెట్టే చిప్ కి ఉండబోయే సీక్వెన్సెస్ లో నిధి అగర్వాల్ కీ రోల్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తుంది.

నిన్నా మొన్నటి వరకు ఈ సినిమాలో నిధి అగర్వాల్ సైంటిస్ట్ గా కనిపిస్తుందనే టాక్ నడిచినా, రీసెంట్ గా ట్రైలర్ లో రివీల్ అయినదాన్ని బట్టి, సైంటిస్ట్ కాదు డాక్టర్ అని రివీల్ అవుతుంది. మరీ ముఖ్యంగా కథని మలుపుతిప్పే ఇన్సిడెంట్.. హీరో మైండ్ లో చిప్ ఇన్సర్ట్ చేసేది కూడా నిధి అగర్వాలే అని తెలుస్తుంది.

ఇక హీరో మైండ్ లో చిప్ ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం పోలీసులకైనా, ఈ గ్లామరస్ డాక్టర్ కైనా ఎందుకొచ్చింది  అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది కానీ, నిధి మాత్రం ఈ రేంజ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్న సినిమాలో ఈ స్థాయి రోల్ ప్లే చేయడం… తన కరియర్ కే బిగ్గెస్ట్ ఎసెట్ కానుంది.

ఓ రకంగా చెప్పాలంటే ఈ సినిమాతో 100% కమర్షియల్ హీరోయిన్ గా లాంచ్ అవుతుంది నిధి అగర్వాల్. ఈ సినిమా టాలీవుడ్ లో క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ చూస్తుంటే.. నిధి అగర్వాల్ కరియర్ లో ‘ఇస్మార్ట్ శంకర్ కి ముందు.. తరవాత’ అనే స్థాయిలో నిధి కరియర్ ఉండబోతుందనిపిస్తుంది.