వెంకటేష్ – తేజ సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Wednesday,February 14,2018 - 06:06 by Z_CLU

ఫిబ్రవరి 18  నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది వెంకటేష్ మూవీ. తేజ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో వెంకీ సరసన హీరోయిన్ గా శ్రియను సెలక్ట్ చేశారు.

గతంలో సుభాష్ చంద్రబోస్, గోపాల గోపాల సినిమాల్లో వెంకటేష్ సరసన జోడీ కట్టిన శ్రియ, ఈ సినిమాతో ముచ్చటగా మూడోసారి వెంకీ సరసన నటించనుంది. అంతేకాదు.. గతంలో వెంకటేష్ నటించిన ఓ సినిమాలో ఈమె ఐటెంసాంగ్ కూడా చేసింది.

ఈ సినిమాకి ‘ఆట నాదే – వేట నాదే’ అనే టాక్ వినిపిస్తున్నా ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు సినిమా యూనిట్. సురేష్ బాబు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని  సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ తో పాటు AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.