ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లోగో రిలీజ్ డేట్

Monday,August 14,2017 - 08:02 by Z_CLU

మెగాస్టార్ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఫాస్ట్ పేజ్ లో జరుగుతుంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా లోగోని చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగష్టు 22 న రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్. మెగాస్టార్ కమ్ బ్యాక్ మూవీ తరవాత ఫ్యాన్స్ లో ఓ రేంజ్ ఇంటరెస్టింగ్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నాడు.

మెగాస్టార్ ఫ్రీడమ్ ఫైటర్ లా నటించనున్న ఈ సినిమాలో నయనతారని హీరోయిన్ గా ఫిక్స్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. భారీ స్థాయిలో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న సినిమా యూనిట్, రైట్ టైమ్ చూసుకుని సినిమాని సెట్స్ పైకి తీసుకువచ్చే ఆలోచనలో ఉంది.