అమెరికాలో ల్యాండ్ అయిన అఖిల్

Tuesday,December 12,2017 - 11:02 by Z_CLU

హలో సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్న అఖిల్ అమెరికాలో ల్యాండ్ అయ్యాడు. సినిమా విజయంలో ఓవర్సీస్ వసూళ్లు కీలకంగా మారడంతో.. ప్రచారాన్ని యూఎస్ నుంచి ప్రారంభించాడు. మరో హీరో రానాతో కలిసి న్యూజెర్సీ నుంచి ప్రచారం షురూ చేయబోతున్నాడు అఖిల్.

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హలో సినిమాను ఈనెల 22న గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. యూఎస్ లో 3 రోజుల పాటు ప్రచారం నిర్వహించిన తర్వాత హైదరాబాద్ తిరిగొస్తాడు అఖిల్. ఆ వెంటనే సినిమాకు సంబంధించి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తారు.

అనూప్ రూబెన్స్ అందించిన పాటలు ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకున్నాయి. పాటలు విన్న ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. ట్రయిలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదే ఊపులో మరికొన్ని గంటల్లో యాక్షన్ పార్ట్ మేకింగ్ వీడియోను కూడా విడుదల చేయనుంది హలో టీం