హ్యాపీ బర్త్ డే మెగా సుప్రీమ్ హీరో

Sunday,October 15,2017 - 10:09 by Z_CLU

బ్యాక్‌గ్రౌండ్ మెద‌టి సినిమా వ‌ర‌కే ఉపయోగపడుతుందని.. ఆ త‌రువాత హ‌ర్డ‌వ‌ర్క్ డెడికేష‌న్ మాత్ర‌మే మెదిటిరోజు మెద‌టి షోకి ప్రేక్షకులు థియేటర్ కి వ‌చ్చేలా చేస్తుందని నిరూపించి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచాడు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్.

మెగాస్టార్ చిరంజీవి, మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనల్లుడిగా ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాతో తెలుగు సినిమా ర్నగానికి హీరోగా పరిచయమైన సాయి ధరమ్ తేజ్ మొదటి సినిమాతోనే  తానేంటో నిరూపించుకొని తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, డాన్సులతో మెస్మరైజ్ చేసి మెగా ఫాన్స్ తో పాటు ప్రేక్షకులందరిచేత శెభాష్ అనిపించుకున్నాడు.

తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని ఆ తర్వాత ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘సుప్రీమ్’ సినిమాలతో వరుస హిట్స్ అందుకొని బాక్సాఫీస్ దగ్గర   మెగా సుప్రీమ్ హీరోగా సత్తా చాటిన సాయి ధరమ్ తేజ్ కి పుట్టినరోజు రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సుప్రీమ్ హీరోగా ఇలాగే సూపర్ స్పీడ్ తో దూసుకెళ్తూ మరెన్నో సూపర్ హిట్స్ అందుకోవాలని ఆశిస్తుంది జీ సినిమాలు.