జీ సినిమాలు ( 15th అక్టోబర్ )

Saturday,October 14,2017 - 10:03 by Z_CLU

జాదూగాడు

హీరో  హీరోయిన్స్ : నాగ శౌర్య, సోనారిక

ఇతర నటీ నటులు : ఆశిష్ విద్యార్థి, అజయ్, జాకీర్ ఉస్సేన్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి,పృద్వి రాజ్, కోట శ్రీనివాస రావు

సంగీతం :సాగర్ మహతి

నిర్మాత : వి.వి.ఎన్.ప్రసాద్

దర్శకత్వం : యోగి

అప్పటి వరకూ ప్రేమ కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించి లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న నాగ సౌర్య  పక్కా మాస్ క్యారెక్టర్ లో నటించిన  అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ‘జాదూ గాడు’.  ఈ చిత్రం తో హీరో నాగ సౌర్య ను సరి కొత్త కోణం లో ఆవిష్కరించి అలరించాడు దర్శకుడు యోగి. యాక్షన్ సన్నివేశాలతో పాటు  కామెడీ సన్నివేశాలు, క్లైమాక్స్, సాగర్ మహతి అందించిన పాటలు హైలైట్స్.   శ్రీనివాస్ రెడ్డి. పృద్వి, రమేష్, సప్తగిరి కామెడీ సన్నివేశాలు అలరిస్తాయి. నాగ సౌర్య సరసన కథానాయికగా నటించిన సోనారిక తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది.

==============================================================================

బంపర్  ఆఫర్

నటీనటులు : సాయి రామ్ శంకర్, బిందు మాధవి

ఇతర నటీనటులు : సాయాజీ షిండే, చంద్ర మోహన్, కోవై సరళ, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్, అలీ, జయప్రకాశ్, వేణు మాధవ్  తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రఘు కుంచె

డైరెక్టర్ : జయ రవీంద్ర

ప్రొడ్యూసర్ : పూరి జగన్నాథ్

రిలీజ్ డేట్ : 23 అక్టోబర్ 2009

సాయి రామ్ శంకర్, మిందు మాధవి జంటగా జయ రవీంద్ర దర్శకత్వం లో స్టార్ డైరెక్టర్  పూరి జగన్నాథ్ నిర్మించిన సినిమా ‘బంపర్ ఆఫర్’. ఓ లో క్లాస్ కూర్రాడికి హై క్లాస్ అమ్మాయి కి మధ్య జరిగే లవ్ స్టోరీ తో మాస్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సాయి రామ్ శంకర్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్,బిందు మాధవి గ్లామర్, కోవై సరళ, ధర్మ వరపు, బ్రహ్మానందం, ఎమ్.ఎస్ కామెడీ, రఘు కుంచె మ్యూజిక్, షాయాజీ షిండే-సాయి రామ్ శంకర్ మధ్య వచ్చే సీన్స్ హైలైట్స్. అన్ని అంశాలు కలగలిపిన ఈ మాస్ ఎంటర్టైనర్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.

==============================================================================

యోగి

నటీనటులు : ప్రభాస్, నాయన తార

ఇతర నటీనటులు : కోట శ్రీనివాస రావు, ప్రదీప్ రావత్, సుబ్బరాజు, ఆలీ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రమణ గోగుల

డైరెక్టర్ : V.V. వినాయక్

ప్రొడ్యూసర్ : రవీంద్ర నాథ్ రెడ్డి

రిలీజ్ డేట్ : 12 జనవరి 2017

ప్రభాస్ హీరోగా V.V. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన హై ఎండ్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ యోగి. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఊర్వశి శారద ప్రభాస్ కి తల్లిగా నటించారు. ఈ ఇద్దరి మధ్యన నడిచే ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

భగీరథ

నటీనటులు : రవి తేజ, శ్రియ

ఇతర నటీనటులు :  ప్రకాష్ రాజ్, నాజర్,

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : రసూల్ ఎల్లోర్

ప్రొడ్యూసర్ :మల్లిడి సత్య నారాయణ రెడ్డి

రిలీజ్ డేట్ : అక్టోబర్ 13, 2005

రవి తేజ, శ్రియ హీరో హీరోయిన్స్ గా రసూల్ ఎల్లోర్ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా          ‘భగీరథ’. ఈ సినిమాకు ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా గుర్తింపు అందుకున్న కిషోర్ కుమార్ పార్ధసాని (డాలీ) కథ ను అందించారు. కృష్ణ లంక అనే పల్లెటూరి లో జనాలు పడే ఇబ్బందులను ఓ యువకుడు ఎలా పరిష్కరించాడు అనే కథతో ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా లో రవి తేజ నటన, శ్రియ గ్లామర్, పల్లెటూరి సీన్స్, చక్రి పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా రవి తేజ-ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే పోటా పోటీ సీన్స్ అందరినీ అలరిస్తాయి.

==============================================================================

 

పోలీస్ స్టోరీ-2

హీరో – సాయికుమార్

ఇతర నటీనటులు – రాక్ లైన్ వెంకటేశ్, పీజే శర్మ, సన, శోభరాజ్, పొన్నాంబలం

సంగీతం – ఆర్పీ పట్నాయక్

స్క్రీన్ ప్లే, దర్శకత్వం – థ్రిల్లర్ ముంజు

విడుదల తేదీ – 1996

అప్పటికే సౌత్ లో పెద్ద హిట్ అయిన పోలీస్ స్టోరీకి సీక్వెల్ గా పోలీస్ స్టోరీ-2ను తెరకెక్కించారు. పోలీస్ స్టోరీ సినిమాకు పనిచేసిన టీం అంతా దాదాపుగా ఈ సీక్వెల్ కు కూడా పనిచేశారు. ఇప్పటికీ సాయికుమార్ కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే అగ్ని పాత్ర ఈ సినిమాలోనిదే. యాక్షన్ సినిమాలు, అదిరిపోయే మాస్ డైలాగులు కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటిది.

==============================================================================

వాసుకి

నటీనటులు : మమ్ముట్టి, నయనతార

ఇతర నటీనటులు : బేబీ అనన్య, షీలు అబ్రహాం, రచన నారాయణ కుట్టి, S.N. స్వామి, రోషన్ మాథ్యూ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : గోపీ సుందర్

డైరెక్టర్ : A.K. సాజన్

ప్రొడ్యూసర్ : జియో అబ్రహాం, P. వేణు గోపాల్

రిలీజ్ డేట్ : 12 ఫిబ్రవరి 2016

నయనతార లీడ్ రోల్ ప్లే చేసిన రివేంజ్ థ్రిల్లర్ వాసుకి. కథాకళి డ్యాన్సర్ అయిన ఒక సాధారణ మహిళ తనకు జరిగిన అన్యాయానికి ఏ విధంగా రివేంజ్ తీసుకుంది అనేదే ఈ సినిమాల్ని ప్రధాన కథాంశం. నయనతార నటన ఈ సినిమాలో హైలెట్ గా నిలిచింది.