మొదటి దర్శకుడితో మ్యచో హీరో సినిమా ?

Sunday,November 24,2019 - 01:00 by Z_CLU

ప్రస్తుతం బిను సుబ్రహ్మణ్యం డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు గోపీచంద్. అలాగే సంపత్ నందితో ఓ సినిమా కమిట్ అయ్యాడు. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. ఈ రెండు సినిమాల తర్వాత గోపీచంద్ తేజ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

ఇటివలే ‘సీత’తో ప్రేక్షకులను నిరాశపరిచిన తేజ గోపీచంద్ కోసం ఓ పవర్ ఫుల్ సబ్జెక్ట్ రెడీ చేసి గోపికి వినిపించాడట. అయితే ఈ కాంబినేషన్ సినిమాను నిర్మించే నిర్మాత ఎవరు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే డీటెయిల్స్ తెలియాల్సి ఉంది.