ఇద్దరిలో ముందెవరితో ?

Sunday,November 24,2019 - 12:02 by Z_CLU

ఒక సినిమా హిట్టయితే డెబ్యూ డైరెక్టర్ హీరోలు ఇక వరుసగా రెండు సూపర్ హిట్స్ అందుకుంటే వదులుతారా..? ఇప్పుడు శివ నిర్వాణ విషయంలో అదే జరుగుతుంది. మొదటి సినిమా ‘నిన్ను కోరి’ తో హిట్ అందుకున్న శివ రెండో సినిమా ‘మజిలీ’తో కూడా సూపర్ హిట్ అందుకున్నాడు.

 

ఇక ‘మజిలీ’ షూటింగ్ సమయంలో విజయ్ కి ఓ స్క్రిప్ట్ చెప్పి గ్రీన్ సిగ్నల్ అందుకున్న శివ నాని కోసం కూడా మరో కథను సిద్దం చేసాడు. ఈ ఇద్దరితో శివ సినిమాలు కన్ఫర్మ్ అయ్యాయి. వీటిలో ఒక సినిమాను సన్ షైన్ బ్యానర్ లో చేయాల్సి ఉంది. ప్రస్తుతం నాని కొత్త దర్శకుడితో నెక్స్ట్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇక విజయ్ కూడా పూరి ‘ఫైటర్ ‘తో పాటు ‘హీరో’ సినిమాను ఫినిష్ చేయాల్సి ఉంది. అంటే ఇద్దరు హీరోలు ప్రస్తుతం బిజీగా ఉన్నారు. మరి ఈ ఇద్దరిలో శివ నెక్స్ట్ ఎవరితో సినిమా చేసి హ్యాట్రిక్ హిట్ కొడతాడో చూడాలి.