చైతూ నెక్స్ట్ సినిమా ఎవరితో ?

Sunday,November 24,2019 - 03:02 by Z_CLU

ప్రస్తుతం ‘వెంకీ మామ’ తో వచ్చే నెల ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్న నాగ చైతన్య శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.

అయితే ఈ సినిమా తర్వాత చైతూ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుందా అనేది ఇంకా తేలడం లేదు. ఇటివలే చైతుని కలిసి ఓ స్క్రిప్ట్ వినిపించాడట పరశురాం బుజ్జీ. మహేష్ సినిమాతో పాటు విజయ్ దేవేరకొండ సినిమా కూడా ఇంకా ఆలస్యం అవుతుండటంతో ఈ లోపు చైతుతో ఓ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయాలని చూస్తున్నాడట. ఇక చైతూ నెక్స్ట్ సినిమా బుజ్జితోనే అనే టాక్ గట్టిగా వినబడుతుంది. మరి ఈ విషయంపై చైతు క్లారితే ఇచ్చేదెప్పుడో ?