RamaBanam థర్డ్ సింగిల్ రిలీజ్

Tuesday,April 25,2023 - 01:42 by Z_CLU

మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న ‘రామబాణం’తో హ్యాట్రిక్ ని పూర్తి చేయనున్నారు. ఈ రోజ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గత బ్లాక్ బస్టర్ ‘ధమాకా’ హీరోయిన్ శ్రీలీల ‘రామబాణం’ థర్డ్ సింగిల్ లిరికల్‌ వీడియోని లాంచ్ చేశారు. మిక్కీ జె మేయర్ ఈ పాటని మెస్మరైజింగ్ ట్రాక్ గా కంపోజ్ చేశారు. ఇటు మెలోడి అటు బీట్ రెండిటిని అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తూ… మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఈ పాటని స్వరపరిచారు.

తను ఇష్టపడే అమ్మాయి అందంపై హీరో ప్రశంసలు కురిపించే పాటకు శ్రీమణి సాహిత్యం అందించారు. రితేష్ జి రావు ప్లజంట్ వాయిస్ పాటకు అదనపు ఆకర్షణ తెచ్చింది. కోల్‌కతా నేపథ్యంలో సాగే ఈ పాటలో విజువల్స్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. గోపీచంద్, డింపుల్ హయాతి అందంగా కనిపించారు. దినేష్ కుమార్ పాటకు కొరియోగ్రఫీ అందించారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాత. భూపతి రాజా ఈ చిత్రానికి కథను అందించగా, వెట్రి పళని స్వామి కెమరామెన్ గా పని చేస్తున్నారు. మధుసూదన్ పడమటి డైలాగ్స్ అందించగా, ప్రవీణ్ పూడి ఎడిటర్ గా పనిచేస్తున్నారు.

జగపతి బాబు, ఖుష్బు ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రంలో సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

మే 5న ఈ చిత్రం భారీస్థాయిలో విడుదల కానుంది.