స్పెషల్ షో ఉంటుందా ?

Tuesday,January 03,2017 - 06:00 by Z_CLU

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రిలీజ్ కి రెడీ అయింది. సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కానున్న ఈ సినిమా పై అటు ఆడియన్స్ లో ఇటు ఇండస్ట్రీ లో కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా చూడడానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇతర మంత్రులు, ఇండస్ట్రీలో ప్రముఖులు ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ గా ఫస్ట్ కాపీ కూడా రెడీ అయింది కానీ సినిమాకు సంబంధించి స్పెషల్ షో ఎప్పుడనేది మాత్రం అనౌన్స్ చేయలేదు యూనిట్.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ నందమూరి బాలకృష్ణ 100 వ సినిమా కాబట్టి రాజకీయ సినీ ప్రముఖుల నుంచి… ముఖ్యమంత్రులతో కలుపుకొని 100 మందిని సెలెక్ట్ చేసి స్పెషల్ షో ప్లాన్ చేస్తున్నారట యూనిట్. అంతా కుదిరితే త్వరలోనే ఈ స్పెషల్ షో డేట్ తో పాటు ప్లేస్ కూడా ఫిక్స్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా జనవరి 12 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఓవర్సీస్ లో 11 నుంచే సందడి చేయనుంది.