Veerasimhareddy Trailer అదరగొట్టిన బాలయ్య

Friday,January 06,2023 - 09:02 by Z_CLU

బాలయ్య ఫ్యాన్స్ తో పాటు సినిమా అభిమనులందరూ ఎదురుచూస్తున్న ‘వీర సింహా రెడ్డి’ Veerasimhareddy Trailer  ట్రైలర్ వచ్చేసింది. పవర్ పాక్డ్ యాక్షన్ తో బాలయ్య ఈ సంక్రాంతి బరిలో దిగబోతున్నాడాని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా బాలయ్య చెప్పిన డైలాగ్స్ ట్రైలర్ లో గూస్ బంప్స్ తెప్పించాయి.

సీమలో ఏ ఒక్కడు కత్తి పట్టకూడదని నేనొక్కడినే కత్తి పట్టా పరపతి కోసమో , పెత్తనం కోసమో కాదు ముందు తరాలు నాకిచ్చిన భాద్యత. నాది ఫ్యాక్షన్ కాదు సీమ మీద ఎఫెక్షన్ అంటూ బాలయ్య డైలాగ్ తో మొదలై యాక్షన్ గ్లిమ్స్ , సాంగ్స్ విజువల్స్ తో పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చింది ట్రైలర్. ముఖ్యంగా “పది నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరికి వెళ్లయినా నిలబడు అక్కడ నీకో ఓ స్లోగన్ వినిపిస్తుంది“, ” సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో , కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారాదు ,మార్చలేరు.”, “పదవి చూసుకొని మీకు పొగరేమో నాకు బై బర్త్ నా డిఎన్ఏ కే పొగరెక్కువ” అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్స్ హైలైట్స్ నిలిచాయి.

ఓవరాల్ గా బాలయ్య NBK వీర సింహా రెడ్డి ఎలా ఉండాలని ఫ్యాన్స్ మూవీ లవర్స్ కోరుకుంటున్నారో ట్రైలర్ చూస్తే గోపి చంద్ మాలినేని సరిగ్గా అలాగే తీశాడానిపిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై నవీన్ యార్నేని , రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12 న సంక్రాంతి స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.