'శతమానంభవతి' ట్రైలర్ రివ్యూ

Tuesday,January 03,2017 - 07:07 by Z_CLU

సంక్రాంతి అంటేనే ఫ్యామిలీ పండగ. మరీ ముఖ్యంగా పల్లెల్లోనే సిసలైన సంక్రాంతి కనిపిస్తుంది. కొత్త బట్టలు, భోగి మంటలు, సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు… ఇలా ఆ సందడే వేరు. ఇలాంటి అన్ని హంగులతో పల్లెటూరి బ్యాక్ డ్రాప్ తో సిద్ధమైంది శతమానంభవతి సినిమా. ఈ ఏడాది సంక్రాంతికి పర్ ఫెక్ట్ మూవీగా పేరుతెచ్చుకున్న ఈ సినిమా ట్రయిలర్ విడుదలైంది. మరి ట్రయిలర్ తో ఈ సినిమా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.. హేవే లుక్..

shatamanam-bhavathi-prakash-raj-jayasudha

సంక్రాంతికి పిల్లల్ని ఇంటికి పిలుద్దాం అనే డైలాగ్ తోనే అర్థమైపోతుంది ఈ సినిమా సంక్రాంతి మూవీ అని. ఆత్రేయపురం కుర్రాడిగా శర్వానంద్, ఎన్నారై అమ్మాయిగా అనుపమ పరమేశ్వరన్ కనిపిస్తారు. వాళ్లమధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ ఏదో చిన్న సమస్య  ఆ రెండు కుటుంబాల మధ్య ఉంది. ఆ సమస్య ఏంటనే క్యూరియాసిటీని క్రియేట్ చేసేలా ట్రయిలర్ ఉంది. మరీ ముఖ్యంగా ప్రకాష్ రాజ్ కు ట్రయిలర్ లో ఒక్క డైలాగ్ కూడా లేకపోవడం.. సినిమాపై ఆసక్తిని మరింత రేకెత్తించింది.

shatamanam-bhavathi-sharwanand-still

శర్వానంద్ మాటతీరు, మేనరిజమ్ సినిమాకు పర్ ఫెక్ట్ గా సింక్ అయింది. ఎన్నారై అమ్మాయిగా మోడ్రన్ గా కనిపించిన అనుపమ… కొన్ని షేడ్స్ లో అచ్చతెలుగు పల్లెటూరి అమ్మాయిగా కూడా కనిపించి మెప్పించింది.

shatamanam-anupama-still

ఈ సినిమాకు అనుపమ కచ్చితంగా ప్లస్ అవుతుందనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతుంది. ఇక మ్యూజిక్ డైరక్టర్ మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసిన సాంగ్స్ ఇప్పటికే హిట్ అవ్వగా… ట్రయిలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎక్స్ ట్రా మార్కులు కొట్టేశాడు మిక్కీ. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై నిర్మాత దిల్ రాజు ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అందుకే చిరంజీవి, బాలకృష్ణ  లాంటి స్టార్ హీరోల సినిమాలు బరిలో ఉన్నప్పటికీ… సంక్రాంతికి కానుకగా ఈనెల 14న సినిమాను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. దిల్ రాజు నమ్మకానికి తగ్గట్టే ట్రయిలర్, కంప్లీట్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో కలర్ ఫుల్ గా ఉంది. ఈ సంక్రాంతికి కుటుంబసభ్యులందరితో కలిసి చక్కగా ఎంజాయ్ చేసే మూవీ కాబోతోంది శతమానం భవతి.