'ఖైదీ నంబర్ 150' రిలీజ్ డేట్ ఫిక్స్

Tuesday,January 03,2017 - 04:42 by Z_CLU

మెగా స్టార్ చిరంజీవి రిఎంట్రీ ఇస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఖైదీ నంబర్ 150 ‘ రిలీజ్ డేట్ ఫిక్స్ అనౌన్స్ చేసాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. నిన్నటి వరకూ ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఉన్న ప్రశ్నలన్నిటికీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో జవాబిచ్చాడు చెర్రీ.

సంక్రాంతి బరి లో నిలవనున్న ఈ సినిమా ను మొదట 12 కి రిలీజ్ చెయ్యాలని అనుకున్నామని ఆ రోజు బాలయ్య బాబు గారి సినిమా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ రిలీజ్ అవుతుండడం తో ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం మంచిది కాదని ఆలోచించి మా టీం అందరం కలిసి ఫైనల్ గా జనవరి 11న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి డిసైడ్ అయినట్లు అని తెలిపాడు చెర్రీ….