శర్వా లిస్ట్ లో ఐదుగురు దర్శకులు

Saturday,May 13,2017 - 10:00 by Z_CLU

వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతూ లేటెస్ట్ గా ‘శతమానం భవతి’ తో కెరీర్ లో గ్రాండ్ హిట్ అందుకున్న శర్వానంద్ లిస్ట్ లో ప్రెజెంట్ ఓ ఐదుగురు దర్శకులున్నారట. ఓ స్టార్ టాప్ హీరో లిస్ట్ మైంటైన్ చేస్తున్న శర్వా త్వరలోనే ఈ ఐదుగురితో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడట..

ఇప్పటికే ఈ యంగ్ హీరో కోసం శ్రీకాంత్ అడ్డాల, దశరథ్ వంటి దర్శకులు కూడా కథలు రెడీ చేస్తుండగా మరో వైపు సుధీర్ వర్మ లాంటి యంగ్ డైరెక్టర్ కూడా శర్వా తో ఓ సినిమాకి రెడీ అవుతున్నాడట.. ఈ ముగ్గురితో పాటు మరో ఇద్దరు దర్శకులు శర్వా కి కథలు రాసే పనిలో పడ్డారట.. ఇక లేటెస్ట్ గా రాధా సినిమాతో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘మహానుభావుడు’ అనే సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ ఫినిష్ అయ్యాకే నెక్స్ట్ సినిమా ఎవరితో అనేది ఫిక్స్ అవుతాడట..