జీ సినిమాలు ( 13th మే )

Friday,May 12,2017 - 10:02 by Z_CLU

సూపర్ హీరోస్

నటీనటులు – హరీష్, ఏవీఎస్, బ్రహ్మానందం

సంగీత దర్శకుడు – కోటి

దర్శకుడు – ఏవీఎస్

విడుదల తేదీ – 1997

హాస్యనటులంతా హీరోలుగా  మారితే ఎలా ఉంటుందనే చిలిపి ఆలోచన నుంచి పుట్టిన కథే సూపర్ హీరోస్.  సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి.రామానాయుడు నిర్మించిన ఈ సినిమాలో ఏవీఎస్,  బ్రహ్మానందం లీడ్ క్యారెక్టర్స్ పోషించారు. అనుకోని వరం పొందిన ఏవీఎస్, బ్రహ్మానందం…  హరీష్ ప్రేమను ఎలా గెలిపించారు…  తమ తల్లిని ఎలా చేరుకున్నారు అనేదే ఈ సినిమా స్టోరీ. అత్యధిక సంఖ్యలో క్యారెక్టర్ ఆర్టిస్టులు పాల్గొన్న సినిమాగా అప్పట్లో…  సూపర్ హీరోస్ పేరుతెచ్చుకుంది. కథ మొత్తం ఎవీఎస్, బ్రహ్మానందం చుట్టూనే తిరిగినప్పటికీ.. సెంటిమెంట్, కామెడీకి కూడా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు.

==============================================================================

బావ

నటీనటులు : సిద్ధార్థ, ప్రణీత

ఇతర నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, నాజర్, సింధు తులాని

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : రామ్ బాబు

ప్రొడ్యూసర్ : పద్మ కుమార్ చౌదరి

రిలీజ్ డేట్ : 29 డిసెంబర్ 2010

అందమైన పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిందే బావ. ఈ సినిమాలో సిద్ధార్థ, ప్రణీత హీరో హీరోయిన్లుగా నటించారు. రాజేంద్ర ప్రసాద్ సిద్ధార్థ తండ్రి సీతారామ్ గా నటించాడు. నిజానికి అసలు కథ సీతారామ్ దగ్గరి నుండే మొదలవుతుంది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న తను తన భార్య కుటుంబం నుండి తనను దూరం చేశాననే గిల్ట్ ఫీలిగ్ తో తను చేసిన తప్పు తన కొడుకు చేయకూడదు అనుకుంటూ ఉంటాడు. అంతలో వీరబాబు(సిద్ధార్థ) ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి తన భార్య అన్న కూతురు అని తెలుసుకున్న సీతారామ్, వీరబాబుతో తన ప్రేమను మర్చిపొమ్మంటాడు. అప్పుడు వీరబాబు ఏం చేస్తాడు..? కథ ఏ మలుపు తిరుగుతుందన్న అంశాలు ZEE Cinemalu లో చూడాల్సిందే.

==============================================================================

యాక్షన్ 3D

నటీ నటులు : అల్లరి నరేష్, స్నేహా ఉల్లాల్

ఇతర నటీనటులు : వైభవ్, రాజు సుందరం, శ్యామ్, నీలం ఉపాధ్యాయ్, కామ్న జఠ్మలాని తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : బప్పి& బప్పి లహరి, సన్నీ

డైరెక్టర్ : అనిల్ సుంకర

ప్రొడ్యూసర్ : రామబ్రహ్మం సుంకర

రిలీజ్ డేట్ : 21 జూన్ 2013

అల్లరి నరేష్ నటించిన సూపర్ హిట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘యాక్షన్ 3D’. 2D, 3D ఫార్మాట్లలో తెరకెక్కిన మొట్టమొదటి కామెడీ చిత్రం. అల్లరి నరేష్ కరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి అనిల్ సుంకర దర్శకుడు.

=============================================================================

తాజ్ మహల్

నటీ నటులు : శ్రీకాంత్, మోనికా బేడి, సంఘవి

ఇతర నటీనటులు : శ్రీహరి, రంగనాథ్, కోట శ్రీనివాస రావు, నూతన్ ప్రసాద్, సుధ, బ్రహ్మానందం

మ్యూజిక్ డైరెక్టర్ : M.M. శ్రీలేఖ

డైరెక్టర్ : ముప్పలనేని శివ

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్ డేట్ : 25 మే 1995

శ్రీకాంత్ హీరోగా ముప్పలనేని శివ డైరెక్షన్ లో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ తాజ్ మహల్. శ్రీకాంత్ ని లవర్ బాయ్ గా సిల్వర్ స్క్రీన్ పై లవర్ బాయ్ గా ఎస్టాబ్లిష్ చేసిన  సినిమా ఇది. శ్రీకాంత్ సరసన మోనికా బేడీ, సంఘవి నటించారు. M.M. శ్రీలేఖ అందించిన సంగీతం ఈ సినిమాకి హైలెట్.

==============================================================================

భాయ్

నటీ నటులు : నాగార్జున, రీచా గంగోపాధ్యాయ్

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, ఆశిష్ విద్యార్థి, సోను సూద్, ముకుల్  దేవ్, సాయాజీ షిండే, నాగి నీదు, ఎం.ఎస్.నారాయణ, జయప్రకాశ్ రెడ్డి, చలపతి రావు,కె.విశ్వనాధ్, ఎం.ఎస్.నారాయణ, రఘు బాబు,వెన్నెల కిషోర్,అజయ్, ఆదిత్య మీనన్,  తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

రచన, స్క్రీన్ ప్లే ,డైరెక్టర్ : వీర భద్రం చౌదరి

ప్రొడ్యూసర్ : అక్కినేని నాగార్జున

రిలీజ్ డేట్ : 25 అక్టోబర్ 2013

నాగార్జున కథానాయకుడిగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘భాయ్’. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మాణం లో దర్శకుడు వీరభద్రం తెరకెక్కిన ఈ చిత్రం లో భాయ్ గా నాగార్జున నటన, యాక్షన్ ఎపిసోడ్, రీచా గంగోపాధ్యాయ్ గ్లామర్,  దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలైట్స్. ఈ చిత్రం లో బ్రహ్మానందం, రఘు బాబు, వెన్నెల కిషోర్ కామెడీ అలరిస్తుంది.

=============================================================================

బ్రదర్స్ 

నటీనటులు : సూర్య శివకుమార్, కాజల్ అగర్వాల్

ఇతర నటీనటులు : ఇషా శర్వాణి, వివేక్, సచిన్ ఖేడ్కర్, తార

మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్

డైరెక్టర్ : K.V.ఆనంద్

ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్

రిలీజ్ డేట్ : 2012

సూర్య, కాజల్ అగర్వాల్ నటించిన బ్రదర్ సైన్స్ ఫిక్షన్ ఎంటర్ టైనర్. K.V. ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూర్య కరియర్ లోనే హైలెట్ గా నిలిచింది. అతుక్కుని ఉండే కవలలుగా సూర్య నటించిన తీరు అద్భుతమనిపిస్తుంది.

==============================================================================

 

 

వర్ణ 

నటీనటులు  ఆర్య, అనుష్క శెట్టి

ఇతర నటీనటులు వెంకటేష్ హరినాథన్, అశోక్ కుమార్, పాదు రమన్, సెల్వ 

సంగీతం హరీష్ జయరాజ్

దర్శకత్వం సెల్వ రాఘవన్

విడుదల – 22 నవంబర్ 2013 

సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ ఫాంటసీ సినిమా వర్ణ. ఆర్య, అనుష్క జంటగా నటించిన ఈ సినిమా 2013 లో రిలీజ్ అయింది. సినిమా సినిమాకి మధ్య వైవిధ్యం ఉండేలా జాగ్రత్త పడే ఆర్య, ఇలాంటి సినిమా చేయాలనుకోవడం నిజంగా సాహసమే. హై ఎండ్ గ్రాఫిక్స్ తో ఆద్యంతం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన ఈ సినిమా అనుష్క కరియర్ లోను డిఫరెంట్ మూవీ గా నిలిచిపోయింది. హరీష్ జయరాజ్ మ్యూజిక్ ప్రధాన ఆకర్షణ.