నేను లోకల్ కు వంద రోజులు

Saturday,May 13,2017 - 11:20 by Z_CLU

నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది నేను లోకల్. నాని-కీర్తి సురేష్ కాంబినేషన్ లో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నేచురల్  స్టార్ కు మరో విజయాన్ని అందించడంతో పాటు అతడి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది నేను లోకల్ సినిమా.

దిల్ రాజు బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన నేనులోకల్ సినిమాకు అన్నీ కలిసొచ్చాయి. నాని-కీర్తి సురేష్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం సూపర్ హిట్ అయింది. నవీన్ చంద్ర ఎప్పీయరెన్స్, పోసాని పంచ్ లు, ప్రసన్నకుమార్ బెజవాడ డైలాగ్స్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఇలా అన్నీ కలిసి నేను లోకల్ సినిమాను ఈ ఏడాది భారీ విజయాల్లో ఒకటిగా నిలబెట్టాయి.

అతి త్వరలోనే బుల్లితెరపై కూడా సందడి చేయబోతోంది నేను లోకల్ సినిమా. మరికొన్ని రోజుల్లో జీ తెలుగు ఛానెల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా నేను లోకల్ మూవీ సందడి చేయనుంది.