మాజీ ప్రధాని మనవడి కోసం భారీ బడ్జెట్

Saturday,July 30,2016 - 03:19 by Z_CLU

75 కోట్ల భారీ బడ్జెట్‌తో మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, కన్నడంలో అనేక సూపర్‌హిట్‌ చిత్రాలు నిర్మించిన హెచ్‌.డి. కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ చెన్నాంబిక ఫిలింస్‌ పతాకంపై శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మిస్తున్న భారీ చిత్రం ‘జాగ్వార్‌’. ఫస్ట్‌లుక్‌, టీజర్‌ని జూలై 31న  తెలుగు సినీ ప్రముఖుల సమక్షంలో రిలీజ్‌ చేస్తున్నారు.
‘బాహుబలి’, ‘భజరంగి భాయ్‌జాన్‌’ చిత్రాలతో ప్రపంచమంతటా సంచలనం సృష్టించిన గొప్ప కథా రచయిత విజయేంద్రప్రసాద్‌ ఈ ‘జాగ్వార్‌’ చిత్రానికి కథ అందించారు. నటసింహ బాలకృష్ణతో ‘మిత్రుడు’ వంటి హిట్‌ చిత్రాన్ని అందించిన ఎ.మహదేవ్‌ ఈ చిత్రానికి  దర్శకత్వం చేస్తున్నారు. 50కి పైగా చిత్రాలకు సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ చేసిన యస్‌.యస్‌. థమన్‌ ఈ చిత్రానికి సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. ‘రేసుగుర్రం’, ‘బ్రూస్‌లీ’ వంటి భారీ చిత్రాలకు ఫొటోగ్రఫి చేసిన మనోజ్‌ పరమహంస ఈ చిత్రానికి డైరెక్టర్‌ ఆఫ్‌ పొటోగ్రఫిగా వర్క్‌ చేస్తున్నారు. హాలీవుడ్‌ చిత్రాలకు ధీటుగా యాక్షన్‌ సీక్వెన్సెస్‌ని బల్గేరియాకు చెందిన యాక్షన్‌ డైరెక్టర్‌ కలోయాన్‌, ఎన్నో హిట్‌ చిత్రాలకు ఫైట్స్‌ కంపోజ్‌చేసిన రవివర్మ, రామ్‌లక్ష్మణ్‌, సెల్వ ఈ చిత్రంలోని ఫైట్స్‌ని థ్రిల్లింగ్‌గా తెరకెక్కించారు. ముఖ్యంగా బెల్జియంలో కోట్లాది రూపాయల వ్యయంతో చిత్రీకరించిన ఛేజ్‌, ఫైట్‌ ఈ చిత్రంలో స్పెషల్‌ హైలైట్స్‌ అవుతాయి. ఈ చిత్రంలోని అన్ని పాటల్ని ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్‌’వంటి భారీ చిత్రాలకు పాటలు రాసిన రామజోగయ్యశాస్త్రి రాశారు. ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు వర్క్‌చేసిన నారాయణరెడ్డి కళా దర్శకత్వం వహిస్తున్నారు. హేమాహేమీలైన సాంకేతిక నిపుణులతో హై టెక్నికల్‌వాల్యూస్‌తో ‘జాగ్వార్‌’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకునేలా ఏ విషయంలోనూ కాంప్రమైజ్‌ అవకుండా హెచ్‌.డి. కుమారస్వామి నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ సెవన్‌ ఏకర్స్‌లో వేస్తున్న భారీ సెట్స్‌లో జరిగే షెడ్యూల్‌తో నిర్మాణం పూర్తి చేసుకునే ‘జాగ్వార్‌’ చిత్రం 2016లో వచ్చే సినిమాల్లో ఓ సెన్సేషన్‌ హిట్‌గా నిలుస్తుంది.
నిఖిల్‌కుమార్‌, దీప్తి హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు ఓ విలక్షణమైన పాత్ర పోషిస్తున్నారు. ఓ ప్రత్యేక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తోంది. బ్రహ్మానందం, రఘుబాబు, సంపత్‌, ఆదిత్యమీనన్‌, సుప్రీత్‌, రవికాలే ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
కథ: విజయేంద్రప్రసాద్‌, ఫొటోగ్రఫి: మనోజ్‌ పరమహంస, సంగీతం: యస్‌.యస్‌. థమన్‌, సమర్పణ: హెచ్‌.డి. కుమారస్వామి, నిర్మాత: శ్రీమతి అనితా కుమారస్వామి, స్క్రీన్‌ప్లే- మాటలు- దర్శకత్వం: ఎ.మహదేవ్‌