మహేష్ సినిమాలో పవన్ అత్త ?

Wednesday,July 27,2016 - 12:53 by Z_CLU

nadia

Actor : Nadia laguage : Telugu

నిన్న మొన్నటి వరకూ నదియా అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని పేరే అని చెప్పాలి.కానీ ఈ మధ్య ఈ పేరు టాలీవుడ్ లో భలే ఫెమస్ అయిపోయింది. తమిళ కథానాయిక నదియా అప్పట్లో నటించిన తమిళ సినిమాలు తెలుగులోనూ విడుదలయ్యాయి.

కానీ నదియా తెలుగులో వాటి తో అంతగా గుర్తింపు అందుకోలేకపోయింది. ఇక ప్రభాస్ ‘మిర్చి’ చిత్రం తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ నటి కి ఆ చిత్రం ద్వారా మంచి స్వాగతమే లభించిందని చెప్పాలి. ఇక ఈ చిత్రం తరువాత ‘అత్తారింటికి దారేది’ లో పవన్ కు అత్త గా కనిపించి నటి గా మంచి మార్కులతో పాటు టాలీవుడ్ లో మంచి ఆఫర్స్ అందుకుంది ఈ నటి. అయితే తాజాగా ఈమె కు టాలీవుడ్ లో మరో భారీ సినిమాలో అవకాశం వచ్చిందని అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ఇక మహేష్ బాబు నటించబోయే తాజా చిత్రం లో నటి నదియా ఓ ముఖ్య పాత్ర పోషించనుందట. ఈ సినిమాను తమిళ దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం లో ఓ కీలక పాత్ర కోసం ఇటీవలే నదియా ను సంప్రదించాడట దర్శకుడు. ఈ పాత్ర కు నదియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం. మరి ఇదే నిజమైతే ప్రభాస్ -నదియా అలాగే పవన్-నదియా లాగా మహేష్-నదియా కాంబినేషన్ కూడా బ్లాక్ బస్టర్ సాదిస్తుందేమో చూడాలి.