ఎక్కడికి పోతావు చిన్నవాడా - వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్

Sunday,April 16,2017 - 12:55 by Z_CLU

నిఖిల్, అవికా గోర్, హెబ్బా పటేల్, నందితా శ్వేత నటించిన హారర్ & ఇమోషనల్ ఎంటర్ టైనర్ ఎక్కడికి పోతావ్ చిన్నవాడా. నిఖిల్ కరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా. VI ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి శేఖర్ చంద్ర మ్యూజిక్ కంపోజ్  చేశాడు.

డీ మానిటైజేషన్ ఎఫెక్ట్ లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం విశేషం. నవంబర్ 18 న రిలీజైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని థియేటర్స్ కి రప్పించడంలో సక్సెస్ అయింది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, లీడ్ కాస్ట్ న్యాచురల్ పర్ఫామెన్స్.. రీజన్స్ ఏవైతేనేం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ రిలీజైన ప్రతి సెంటర్ లోను బాక్సాఫీస్ దగ్గర భారీ ప్రాఫిట్స్ ని కలెక్ట్ చేసింది.

చిన్న సినిమాగా రిలీజై క్రిటిక్స్ చేత కూడా 100 కి 100 మార్కులు బ్యాగ్ లో వేసుకున్న ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వరల్డ్ ప్రీమియర్ షోగా ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ‘జీ తెలుగు’ లో టెలీకాస్ట్ కానుంది. ఆల్రెడీ థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఈ సినిమా ఇప్పుడీ ప్రీమియర్ షో కి కూడా బోలెడంత ఎగ్జైట్ మెంట్ ని జెనెరేట్ చేయడంలోను సక్సెస్ అవుతుంది.