గంటల్లో రికార్డ్....

Wednesday,October 12,2016 - 03:37 by Z_CLU

రామ్ చరణ్ ధృవ ఎక్స్ పెక్టేషన్స్ కి మించి వైబ్రేషన్స్ సృష్టిస్తుంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ‘ధృవ’ పై ఎక్స్ పెక్టేషన్స్ మొదటి నుండే ఫిక్స్ అయి ఉన్నా, ధృవ టీజర్ రిలీజయిన తరవాత అంతా మారిపోయింది.

“నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శతృవు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది.” అనే డైలాగ్ తో మొదలయ్యే టీజర్, అభిమానుల ఎక్స్ పెక్టేషన్స్ ని మించి అలరిస్తుంది. కేవలం రిలీజయిన 17 గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ క్రాస్ అయ్యాయంటే అభిమానులపై ధృవ ఇంపాక్ట్ ఎంతగా పడిందో తెలిసిపోతుంది.

druva

తని ఒరువన్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు. “నా శత్రువుని నేను సెలెక్ట్ చేసుకున్నాను” అని క్లోజ్ అయ్యే టీజర్, ఈ సారి రామ్ చరణ్ కథను సెలెక్ట్ చేసుకునే విషయంలో ఏ మాత్రం తొందరపడలేదని తెలిసిపోతుంది.