రోబో 2.0 ఫస్ట్ లుక్ పై క్లారిటీ

Wednesday,October 12,2016 - 04:24 by Z_CLU

మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘రోబో-2’ సినిమాకు సంబంధించి తేదీలు ఖరారు చేశాడు డైరెక్టర్ శంకర్. సూపర్ స్టార్ రజనీ కాంత్, శంకర్ కాంబినేషన్ లో మూడో చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు. గతంలో రజనీ-శంకర్  కాంబినేషన్ లో వచ్చిన ‘రోబో’ భారీ విజయం సాధించడంతో ఇప్పుడు రోబో-2 మీద  కోలీవుడ్ తో పాటు బాలీవుడ్, టాలీవుడ్ లో కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి.

endhiran-latest-photo

ఇక ఈ షూటింగ్ ప్రారంభం నుండి  సినిమా గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వని శంకర్ తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్ విడుదల తేదీలను ఖరారు చేశాడు.. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను నవంబర్ 16 న ముంబై లో గ్రాండ్ గా రిలీజ్ చేసి, టీజర్ ను సూపర్ స్టార్ పుట్టిన రోజు నాడు డిసెంబర్ 12 న చెన్నై లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఆ రోజే ఈ టీజర్ ను ముంబై లో అక్షయ్ కుమార్ విడుదల చేస్తాడట. ఇప్పటికే రోబో 2.0 షూటింగ్ ప్రారంభమై 150 రోజులు పూర్తయింది.