కుమ్మేయడానికి రెడీ..

Wednesday,October 12,2016 - 03:17 by Z_CLU

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘డి.జె'(దువ్వాడ జగన్నాథం). ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి  దేవిశ్రీ ప్రసాద్ సంగీత అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేశాడు డి.ఎస్.పి.

cuehp1cvyaih4h1

గతంలో హరీష్ శంకర్, దేవిశ్రీ కాంబినేషన్ లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఆల్బమ్ ఎంతటి సూపర్ హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలోని కెవ్వు కేక సాంగ్ ఇప్పటికీ ఉర్రూతలూగిస్తుంది. ఇక బన్నీ-దేవిల కాంబినేషన్ లో వచ్చిన అన్ని ఆల్బమ్స్ సూపర్ హిట్స్ గా నిలవడంతో డీజే పాటలపై అంచానాలు పెరిగాయి. ఇక ఈ చిత్రం కోసం ఓ అదిరిపోయే ఐటెం సాంగ్ ను కంపోస్ చేయబోతున్నాడట దేవి. మరి ఈ పాట మరో కెవ్వు కేక లా నిలిచిపోతుందేమో..