లండన్ బాబులు టీం వినూత్న ప్రచారం

Monday,November 13,2017 - 12:48 by Z_CLU

రక్షిత్, స్వాతి హీరోహీరోయిన్లుగా మారుతి నిర్మించిన సినిమా లండన్ బాబు. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు వినూత్నంగా ప్రచారం కల్పిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని పలు కాలేజీల్ని చుట్టేసే పనిలో ఉన్న యూనిట్.. ఇప్పుడు ఈ సినిమా కోసం డిఫరెంట్ గా ప్రోమోలు రెడీ చేసింది.

 

మార్కెట్లో బాగా పాపులర్ అయిన ఓ జ్యూయెలరీ యాడ్ ను ఇమిటేట్ చేస్తూ లండన్ బాబులు ప్రోమోలు తయారుచేశారు. డిఫరెంట్ గా చేసిన ఈ ప్రోమోలు ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

ఈ ప్రోమోలతో పాటు మరోవైపు సోషల్ మీడియాలో కూడా అంతే కొత్తగా ప్రచారం నిర్వహిస్తోంది లండన్ బాబులు టీం. ఈ ప్రచారం సినిమాకు మంచి క్రేజ్ తీసుకొస్తోంది. త‌మిళం లో విజ‌య్‌సేతుప‌తి, రితిక న‌టించిన “ఆండ‌వ‌న్ క‌ట్టాలై” చిత్రానికి రీమేక్ గా మారుతి టాకీస్ బ్యానర్ పై నిర్మించిన‌ ఈ చిత్రానికి చిన్నికృష్ణ దర్శకుడు.