వీకెండ్ రిలీజెస్

Wednesday,November 15,2017 - 11:52 by Z_CLU

ఈ వీకెండ్ బాక్సాఫీస్ ముందు పెద్ద జాతర కనిపించనుంది. అవును.. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 9 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో 7 స్ట్రయిట్ సినిమాలు కాగా, 2 డబ్బింగ్ సినిమాలు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. స్ట్రయిట్ రిలీజెస్ లో పెద్దగా స్టార్ కాస్ట్ లేదు. డబ్బింగ్ సినిమాలపై మాత్రం జనాల్లో కూసింత అంచనాలున్నాయి.

స్ట్రయిట్ రిలీజెస్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా లండన్ బాబులు మాత్రమే. గోల్డెన్ హ్యాండ్ మారుతి నుంచి వస్తున్న సినిమా ఇది. మారుతి టాకీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాతో రక్షిత్ హీరోగా పరిచయం అవుతున్నాడు. స్వాతి హీరోయిన్. చిన్నికృష్ణ డైరక్ట్ చేసినే ఈ సినిమాను ఏవీఎస్ స్టుడియోస్ సమర్పిస్తోంది. తమిళ్ లో సూపర్ హిట్ అయిన అండవళ్ కట్టాళై సినిమాకు రీమేక్ ఇది.

లండన్ బాబులు మినహా మిగిలిన సినిమాల్లో చెప్పుకోదగ్గ స్టార్ కాస్ట్ లేదు. డేర్, లవర్స్ క్లబ్, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, ప్రేమతో మీ కార్తీక్, స్నేహమేరా జీవితం, ఎగిసే తారాజువ్వలు అనే సినిమాలు శుక్రవారం విడుదలకానున్నాయి.

ఇక డబ్బింగ్ సినిమాల విషయానికొస్తే చాన్నాళ్ల గ్యాప్ తర్వాత సిద్దార్థ్ నటించిన సినిమా గృహం ఈ వీకెండ్ వస్తోంది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలోకి రావాలి. కానీ సెన్సార్ ఫార్మాలిటీస్ లేట్ అవ్వడంతో ఈ శుక్రవారానికి వాయిదాపడింది. ఆండ్రియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మిలింద్ రావ్ దర్శకుడు. కంప్లీట్ హారర్ సినిమా ఇది.

థియేటర్లలోకి వస్తున్న మరో డబ్బింగ్ మూవీ ఖాకీ. కార్తి, రకుల్ ప్రీత్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ఇది. ఓ పోలీస్ జీవితాన్ని రియలిస్టిక్ గా చూపిస్తూ తెరకెక్కించారు ఈ సినిమాని. రియల్ లైఫ్ ఘటన ఆధారంగా వస్తున్న ఖాకీ సినిమాతో మరోసారి తెలుగులో సక్సెస్ కొడతానంటున్నాడు కార్తి.

మరి ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాల్లో ఏది హిట్ అవుతుందో చూడాలి.