"లండన్ బాబులు" షూటింగ్ పూర్తి

Saturday,July 01,2017 - 03:23 by Z_CLU

ఎప్పటిక‌ప్పుడు మంచి కాన్సెప్ట్ ల‌తో లిమిటెడ్ బ‌డ్జెట్ లో క్వాలిటిగా చిత్రాల‌ను నిర్మిస్తున్న మారుతి టాకీస్‌, ఎవిఎమ్  స్టుడియోస్‌ సమర్పణలో ప్రముఖ దర్శక‌, నిర్మాత‌ మారుతి నిర్మాతగా, చిన్ని కృష్ణ దర్శకుడిగా తెరకెక్కిస్తున్న చిత్రం లండన్ బాబులు. త‌మిళం లో విజ‌య్‌ సేతుప‌తి, రితికా సింగ్ క‌ల‌సి నటించిన “ఆండ‌వ‌న్ క‌ట్టాలై”  చిత్రాన్ని తెలుగు లో రీమేక్‌ చేస్తున్నారు.

నేటి యువత ప్రేమకి, పెళ్లికి ఎంత తొందర పడుతున్నారో అంతే తొందరగా విడాకులు తీసుకోవడంలో కూడా ముందున్నారు. అలాంటి ఓ జంట లండన్ ప్రయాణంలో జరిగిన పరిస్థితులను దర్శకుడు వినోదాత్మకంగా ఎమోషనల్ గా తెరకెక్కించారు. షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటుంది. జులై చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత మారుతి మాట్లాడుతూ.. చిన్నికృష్ణ కామెడి టైమింగ్ కూడా ఈ చిత్రానికి చాలా హెల్ప్ అయ్యింది.  అలాగే  స్వాతి హీరోయిన్ గా నటించింది. స్వాతి మీడియాలో యాంక‌ర్ గా సోసైటి ప‌ట్ల భాద్య‌త క‌లిగిన పాత్ర‌లో చాలా బాగా చేసింది. ర‌క్షిత్ హీరోగా ప‌రిచ‌యమ‌వుతున్నాడు. కొత్త వాడిలా కాకుండా సీనియ‌ర్ న‌టుడిగా పాత్ర‌లో ఒదిగిపోయాడు. జులై చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం.  అని అన్నారు