గ్రాండ్ గా చైతూ, సమంత వెడ్డింగ్ రిసెప్షన్

Monday,November 13,2017 - 11:48 by Z_CLU

అక్కినేని నాగచైతన్య, సమంత వెడ్డింగ్ రిసెప్షన్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులకు నాగార్జున ఈ పార్టీ ఇచ్చారు. గత నెల 6న సమంత, చైతూ వివాహం గోవాలో జరిగింది. ఆ తర్వాత వారానికో రిసెప్షన్ జరుగుతూనే ఉంది. చెన్నైలో ఒకటి, దగ్గుబాటి ఫ్యామిలీతో ఒకటి, క్లోజ్ ఫ్రెండ్స్ తో ఇంకోటి.. ఇలా పార్టీలు జరుగుతూనే ఉన్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులకు ఇచ్చిన ఈ రిసెప్షన్ తో చైతూ-సమంత వెడ్డింగ్ వేడుక పూర్తయింది.

హైదరాబాద్ ఎన్-కన్వెన్షన్ లో గ్రాండ్ గా జరిగిన ఈ రిసెప్షన్ కు రామ్ చరణ్, అల్లు అర్జున్, నాని, అల్లరినరేష్ లాంటి యంగ్ స్టర్స్ తో పాటు చిరంజీవి, కృష్ణంరాజు, కృష్ణ, హరికృష్ణ లాంటి సీనియర్లు హాజరయ్యారు. ఈ రిసెప్షన్ కు దగ్గుబాటి కుటుంబసభ్యులంతా హాజరయ్యారు.

ఇక దర్శకుల్లో దర్శక ధీరుడు రాజమౌళితో పాటు బోయపాటి, కొరటాల, సుకుమార్, కల్యాణ్ కృష్ణ, చందు మొండేటి, కృష్ణ మరిముత్తు, మారుతి ఈ రిసెప్షన్ కు హాజరయ్యారు. గోవాలో జరిగిన పెళ్లిలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచిన అఖిల్.. రాత్రి జరిగిన రిసెప్షన్ కూడా అందర్నీ ఎట్రాక్ట్ చేశాడు.