సెట్స్ పైకి వచ్చేస్తున్న మాస్ మహారాజ్

Sunday,December 11,2016 - 08:22 by Z_CLU

మాస్ మహారాజ్ రవితేజ 2016 లో ఒక్క సినిమా కూడా రాలేదు. బెంగాల్ టైగర్ తరవాత ప్లాన్డ్ గానే బ్రేక్ తీసుకున్న రవితేజ, ఈ లోపు చాలా మంది డైరెక్టర్స్ తో డిస్కషన్స్ చేసినా, అంత ఈజీగా సెట్స్ పైకి రాలేదు. చివరికి అనిల్ రావిపూడి తో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్టు సమాచారం.

2017 లో భారీ బ్లాక్ బస్టర్ ప్లాన్ చేస్తున్న రవితేజ, ఈ సారి తన స్టైల్ మాస్ మసాలా ఎంటర్ టైనర్ ని ప్లాన్ చేస్తున్నాడు. ఇన్ సైడ్ సోర్సెస్ ప్రకారం ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, తక్కిన కాస్టింగ్ సెలెక్షన్ ప్రాసెస్ లో ఉన్నట్టు తెలుస్తుంది.