అదే స్పీడ్ ...

Sunday,December 11,2016 - 12:30 by Z_CLU

ప్రస్తుతం మురుగదాస్ సినిమాతో బిజీగా ఉన్న మహేష్ బాబు,  మరో వైపు కొరటాల శివ డైరెక్షన్త లో తెరకెక్కనున్న సినిమాకి  షెడ్యూల్ కూడా ఆల్ రెడీ ప్లాన్ చేసుకుంటున్నాడు. జనవరి నుండి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా  5 నెలల్లోనే ఫినిష్ చెయ్యాలని డిసైడ్ అయ్యారట మహేష్,కొరటాల.

పొలిటికల్ డ్రామా గా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ను జనతా గ్యారేజ్ స్పీడ్ తోనే ఫినిష్ చేయాలని చూస్తున్నాడట కొరటాల. జనవరి నుండి మొదలు పెట్టి మార్చ్ వరకూ ఈ సినిమా టాకీ పార్ట్ ఫినిష్ చేయబోతున్నాడట.

కొరటాల  సినిమా సెట్స్ పై ఉండగానే వంశీ పైడి పల్లి తో సినిమాను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్న మహేష్, ఆ సినిమాను కూడా ఇమ్మీడియట్ గా సెట్స్ పైకి తీసుకెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాడట మహేష్.

కొరటాల శివ కూడా ఇటు మహేష్ తో సినిమాకు ప్యాకప్ చెప్పీ చెప్పగానే, అదే స్పీడ్ తో, రామ్ చరణ్ తో సినిమాను స్టార్ట్ చేసి మార్చ్ నుండి ఆ సినిమాను సెట్స్ పై పెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట . ఈ ప్లాన్ గాని వర్కౌట్ అయితే వచ్చే ఏడాది సమ్మర్ లోనే ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ సినిమా థియేటర్స్ లోకి అడుగుపెట్టడం ఖాయం.