DSP-Thaman - మళ్లీ సంక్రాంతి పోటీ

Tuesday,January 05,2021 - 01:10 by Z_CLU

 

గతేడాది ‘సరిలేరు నీకెవ్వరు’ , ‘అల వైకుంఠపురములో’ సినిమాలతో సంక్రాంతికి టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ దేవి శ్రీ ప్రసాద్, థమన్ పోటీ పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది సంక్రాంతికి కూడా మళ్ళీ చెరో సినిమాతో పోటీ పడబోతున్నారు.

థమన్ మ్యూజిక్ చేసిన రవితేజ ‘క్రాక్’తో పాటే దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చిన ‘అల్లుడు అదుర్స్’ సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలిచింది.

ముందుగా జనవరి 9న ‘క్రాక్’ సినిమా రిలీజ్ అవుతుండగా జనవరి 15న ‘అల్లుడు అదుర్స్’ థియేటర్స్ లోకి రానుంది. మరి గతేడాది సంక్రాంతికి మ్యూజిక్ పరంగా ఇద్దరు మంచి విజయం అందుకున్నారు. కాకపోతే దేవి మీద తమన్ పై చేయి సాధించి అల వైకుంఠపురములో ఆల్బం తో సెన్సేషన్ అయ్యాడు.

మరి ఈ సంక్రాంతికి ఈ ఇద్దరు తమ ఆల్బంతో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.