RadheShyam - టీజర్ రెడీ

Tuesday,January 05,2021 - 03:47 by Z_CLU

రెబల్ స్టార్ Prabhas లేటెస్ట్ మూవీ Radheshyam సినిమా నుండి అతి త్వరలోనే అప్డేట్ రానుంది. అవును ఇటివలే మోషన్ పోస్టర్ తో ఎట్రాక్ట్ చేసిన మేకర్స్ ఇప్పుడు టీజర్ తో రెడీ అవుతున్నారు. సంక్రాంతి కి టీజర్ ను రిలీజ్ చేసి ప్రభాస్ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వబోతున్నారు.

ఈ టీజర్ రిలీజ్ కి సంబంధించి తాజాగా దర్శకుడు రాధా కృష్ణ ఇప్పటికే ఫ్యాన్స్ కి సోషల్ మీడియా ద్వారా హింట్ ఇచ్చాడు. త్వరలోనే టీజర్ అప్డేట్ రానుందని అభిమానులు తమ ఎదురుచూపులు మరిచిపోయి ఎంజాయ్ చేసేలా టీజర్ ఉంటుందని హామీ ఇచ్చాడు.

దీంతో సంక్రాంతికి రాధేశ్యామ్ టీజర్ రాబోతుందని రెబల్ ఫ్యాన్స్ ఇప్పట్నుండే హంగామా మొదలు పెట్టారు. 2-3 రోజుల్లో ఈ టీజర్ కి సంబంధించి రిలీజ్ డేట్ అండ్ టైంతో అప్డేట్ ఇవ్వనున్నారు మేకర్స్. మరి మోషన్ పోస్టర్ తో అందరినీ ఆకట్టుకున్న రాధేశ్యామ్ టీజర్ తో ఎలాంటి అంచనాలు రేకెత్తిస్తుందో వేచి చూడాలి.

గోపికృష్ణా మూవీస్ పై కృష్ణం రాజు సమర్పణలో యూ.వి.క్రియేషన్స్, T సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.