Interview - నివేత పేతురాజ్

Tuesday,January 05,2021 - 12:02 by Z_CLU

‘మెంటల్ మదిలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన నివేత పేతురాజ్ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం నివేత హీరోయిన్ గా నటించిన RED సినిమా సంక్రాంతికి విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఆ సినిమా గురించి నివేత మాట్లాడింది.

* ఆ సినిమా చూడలేదు

కిషోర్ గారు ‘చిత్రలహరి’ తర్వాత రామ్ తో ‘తడమ్’ రీమేక్ చేస్తున్నాను అందులో కాప్ రోల్ చేయాలని చెప్పారు. ఒరిజినల్ సినిమా చూడకుండానే ఓకె చెప్పేశాను. నిజానికి ఒరిజినల్ సినిమా చూస్తే ఆ రోల్ చేసిన నటి మనల్ని ప్రభావితం చేస్తుంది. అందుకే చూడలేదు. పైగా నాకు కిషోర్ గారి మీద కాన్ఫిడెన్స్ ఎక్కువ. కేవలం తమిళ్ సినిమాలో ఒక్క సీన్ మాత్రమే చూశాను.

nivetha-pethuraj-నివేత-పెతురాజ్
* పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో

సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో నటించాను. అస్సలు నవ్వకుండా సీరియస్ గా ఉండటం కోసం చాలా కష్టపడ్డాను. ఒరిజినల్ సినిమాలో కంటే రెడ్ లో నా రోల్ పెంచారు. సినిమాలో నాకు యాక్షన్ ఎపిసోడ్స్ ఉండవు. అయినా హీరోయిన్స్ కి యాక్షన్ చేయడం కష్టమే.

* వాళ్లిద్దరూ స్క్రిప్ట్ చెప్పకపోయినా ఓకె

తెలుగులో వివేక్ ఆత్రేయ, కిషోర్ తిరుమల ఇద్దరూ స్క్రిప్ట్ చెప్పకపోయినా చేస్తా… వాళ్లపై నాకున్న కాన్ఫిడెన్స్ అలాంటిది. నేను వర్క్ చేసిన దర్శకుల్లో వారిద్దరితోనే ఎక్కువగా ట్రావెల్ అయ్యాను. ఇద్దరితో చెరో రెండు సినిమాలు చేయడం సంతోషంగా ఉంది.

nivetha-pethuraj-నివేత-పెతురాజ్

* రామ్ లో బెస్ట్ క్వాలిటీ అదే

హీరో రామ్ చాలా కూల్ అబ్బాయి. సెట్స్ లో చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తాడు. ఒక్కసారి యాక్షన్ అంటే చాలు క్యారెక్టర్ లో దూరిపోతాడు. కట్ చెప్పగానే వితిన్ సెకండ్స్ లో క్యారెక్టర్ లో నుండి బయటికి వచ్చేసి చిల్ అవుతూ మ్యూజిక్ వింటుంటాడు. అలా వెంటనే పాత్రలో నుండి బయటికి వచ్చి మనలా ఉండటం రామ్ లో బెస్ట్ క్వాలిటీ అనిపించింది. అలా కట్ చెప్పగానే నాలా ఉండటం రామ్ నుండి నేర్చుకున్నాను.

* కాన్ఫిడెన్స్ ఉంది

మహేష్ బాబు గారు ఏదో ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఏ సినిమా గురించైనా కేవలం 5-6 రోజుల షూటింగ్ తో తెలిసిపోతుంది. రెడ్ షూటింగ్ స్టార్ట్ అవ్వగానే ఇది పక్కా సూపర్ హిట్ సినిమా అని అర్థమైపోయింది. ఇప్పటికీ అదే కాన్ఫిడెన్స్ ఉంది. కచ్చితంగా సంక్రాంతి కి మంచి విజయం అందుకుంటుందన్న నమ్మకం ఉంది.

nivetha-pethuraj-నివేత-పెతురాజ్
* సంక్రాంతి సెంటిమెంట్ తో

గతేడాది సంక్రాంతి నేను నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా విడుదలై పెద్ద హిట్ అయ్యింది. ఈ సంక్రాంతి కి మళ్లీ నేను నటించిన రెడ్ రిలీజ్ అవుతుంది. సో సంక్రాంతి సెంటిమెంట్ ఈసారి కూడా వర్కౌట్ అవుతుందని ఆశిస్తున్నాను.

* నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అవే

నెక్స్ట్ విశ్వక్ సేన్ పాగల్ సినిమాలో నటిస్తున్నాను. అలాగే చందు మొండేటి దర్శకత్వంలో ఒక వెబ్ మూవీ చేస్తున్నాను. ‘కార్తికేయ 2’ ఆఫర్ కూడా ఉంది. త్వరలోనే ఆ స్క్రిప్ట్ విని ఒకే చేస్తాను. తమిళ్ ఒక పెద్ద సినిమా చేస్తున్నాను. త్వరలోనే ఆ సినిమా ఎనౌన్స్ కానుంది..