Waltair Veerayya - టైటిల్ సాంగ్ వచ్చేస్తోంది

Sunday,December 25,2022 - 07:43 by Z_CLU

Chiranjeevi’s Waltair Veerayya Title Song On December 26th

చిరంజీవి (Chiranjeevi), బాబీ కొల్లి మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల పాత్రల ఇంట్రడక్షన్ గ్లింప్సెస్‌ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రతిసారీ చిరంజీవి కోసం బ్లాక్‌బస్టర్ ఆల్బమ్‌ లు అందించిన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devisri Prasad) మరో సంచలన ఆల్బమ్‌ ను అందించాడు.

chiranjeevi waltair veerayya

ఆల్బమ్‌ లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి పాటలు ఇప్పటికే పెద్ద హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు మూడవ సింగిల్ కోసం సమయం వచ్చింది.

డిసెంబరు 26న వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్‌ ను విడుదల చేయనున్నారు. ఈ రాకింగ్ ట్రాక్‌ తో డిఎస్పీ పూనకాలు అందించనున్నారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ చిరంజీవిని స్టైలిష్ అవతార్‌ లో ప్రజంట్ చేసింది. పోస్టర్‌ లో చేతిలో పోర్టబుల్ గ్యాస్ బర్నర్ పట్టుకుని కనిపించారు. ఈ గెటప్, చిరంజీవి గ్యాస్ బర్నర్ పట్టుకుని చేసిన యాక్ట్ ‘గ్యాంగ్ లీడర్‌’ ను గుర్తు చేస్తుంది.

chiranjeevi waltair veerayya

చిరంజీవి సరసన శృతి హాసన్ (Shruti Hassan) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాత.

chiranjeevi shruti hassan waltair veerayya 2

ఆర్థర్ ఎ విల్సన్ కెమెరామెన్ గా, నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.

chiranjeevi waltair veerayya 3

ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు.

వాల్తేరు వీరయ్య జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

chiranjeevi shruti hassan waltair veerayya 1