మ్యూజిక్ బేస్డ్ కథ దొరికితే హీరో అవుతా

Saturday,January 11,2020 - 02:43 by Z_CLU

దేవిశ్రీ ప్రసాద్ హీరోగా మారబోతున్నాడోచ్
ఈ టాపిక్ ఇప్పటిది కాదు. దాదాపు ఐదేళ్లుగా నడుస్తున్న ఇష్యూ ఇది. దేవిశ్రీని హీరోని చేస్తానంటాడు సుకుమార్. నేనే ప్రొడ్యూసర్ అంటాడు దిల్ రాజు. నేను కూడా రెడీ అంటాడు దేవిశ్రీ. కానీ ముగ్గురూ కలవరు. అలా తన హీరో కలను ఏళ్లకు ఏళ్లు పోస్టుపోన్ చేసుకుంటూ వస్తున్నాడు డీఎస్పీ. తాజాగా మరోసారి ఈ టాపిక్ పై రియాక్ట్ అయ్యాడు దేవిశ్రీ.

“సినిమా చేయమని అడుగుతున్నారు గాని, నాకు మ్యూజిక్ మీద ఉన్న ఇంట్రస్ట్ వల్లనేమో యాక్టింగ్ చేయాలనే ఆసక్తి రావడం లేదు. అయితే నాకు తమిళంలో ఎక్కువమంది కథలు చెబుతున్నారు. సంగీతం ప్రధానంగా సాగే కొత్త కథ ఉంటే ఏదైనా ఉంటే త‌ప్ప‌కుండా చేస్తాను.”

చూశారుగా.. ఇది దేవిశ్రీ రియాక్షన్. కనీసం కొత్త ఏడాదిలోనైనా ఈ స్టార్ కంపోజర్ హీరోగా అవతారం ఎత్తుతాడేమో చూడాలి.