

Saturday,January 11,2020 - 03:23 by Z_CLU
“డైలాగ్స్ గురించి నిజంగా నేను ఆలోచించను. స్పాంటేనియస్ రచయితగా నన్ను నేను చూసుకుంటా. నేనెక్కడికో వెళ్లి రాస్తుంటానని అనుకుంటారు. నేను మా ఇంట్లోనే రాసేసుకుంటూ ఉంటాను. నేను చాలా తేలిగ్గా, ప్రశాంతంగా పనిచేయడానికి ఇష్టపడతా.”
“మనం ప్రపంచం అంతా తిరగొచ్చు. కానీ ఇంటికొచ్చాక ఒక సుఖం వస్తుంది. ఆ ఇంటికొచ్చిన ఫీలింగే వేరు. అందుకే ‘హోం కమింగ్’ అంటాం. మనకు తెలీకుండానే ఇల్లు మన సంస్కృతిలో ఒక భాగం. అది చిన్నదే కావచ్చు. ఇంట్లో ఉంటే ఆ ఆనందమే వేరు. బహుశా నేను ఆ ఇంట్లో ఆనందాన్ని వెతుక్కొనే ప్రయత్నం చేస్తానేమో. అందుకే నా సినిమాల్లో కథకి ఇల్లు కేంద్రంగా ఉంటూ ఉండొచ్చు. ‘అల.. వైకుంఠపురములో’ మూవీలో ‘వైకుంఠపురం’ అనే ఇంటికి ఉన్న విలువను అలా సింబలైజ్ చేశాను. ఆ ఇంటికి హీరో వెళ్లడం ఎందుకు ముఖ్యమైన విషయమయ్యింది? అందుకే ఆ ఇంటికి ఆ పేరుపెట్టి, అదే సినిమాకి టైటిల్ గా పెట్టా.”