Devisri - ఆశలన్నీ అతడిపైనే

Tuesday,September 22,2020 - 12:29 by Z_CLU

కొన్నేళ్లుగా దేవిశ్రీప్రసాద్ కు బ్యాడ్ ఫేజ్ నడుస్తోంది. ఇంకా చెప్పాలంటే ‘రంగస్థలం’ తర్వాత సరైన ఆల్బమ్ ఇవ్వలేకపోయాడు ఈ సంగీత దర్శకుడు. దీనికితోడు పెద్ద హీరోలంతా తమన్ వెంట పడుతున్న వేళ.. చేతికొచ్చిన చిన్న సినిమాలతోనే బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిన పరిస్థితి. ఇలాంటి సిచ్యుయేషన్ లో Devisri చేతిలో ఉన్న ఒకే ఒక్క పెద్ద అవకాశం ‘పుష్ప’.

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న Pushpa Movie పైనే దేవిశ్రీప్రసాద్ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అన్ని పాటలు ఇచ్చేశాడు DSP. మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఆ పాటలు క్లిక్కయితే దేవిశ్రీ ప్రసాద్ కు ఓ లైఫ్ లైన్ దొరికినట్టవుతుంది.

నిజానికి సుకుమార్-దేవిశ్రీ కాంబోలో మ్యూజిక్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. అటు Allu Arjun Devisri కాంబినేషన్ కూడా మ్యూజికల్ గా ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. కాబట్టి.. ఈసారి సుక్కూ-దేవి-బన్నీ కలిసి కచ్చితంగా హిట్ ఆల్బమ్ ఇస్తారనే అంచనాలున్నాయి. వీటికితోడు దేవిశ్రీప్రసాద్ మంచి ఆకలి మీద ఉండడం కూడా ‘పుష్ప’కు కలిసొచ్చే ఎలిమెంట్ గా చెబుతున్నారు.

ప్రస్తుతం చేతిలో “గుడ్ లక్ సఖి”, “రంగ్ దే”, “ఉప్పెన” లాంటి సినిమాలున్నప్పటికీ దేవిశ్రీ మాత్రం తన ఆశలన్నీ ‘పుష్ప’పైనే పెట్టుకున్నాడు.