మోషన్ పోస్టర్ తో హంగామా చేస్తున్న 'రౌడీ బాయ్స్'

Thursday,April 08,2021 - 06:27 by Z_CLU

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ నుండి ఆశిష్ హీరోగా పరిచయమవుతున్న ‘రౌడీ బాయ్స్’ సినిమా మోషన్ పోస్టర్ రిలీజైంది. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో లవ్ యాక్షన్ డ్రామాగా  తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి విడుదలైన మోషన్ పోస్టర్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తోంది. కాలేజీ నేపథ్యంలో సాగే కథతో రూపొందుతున్న సినిమా అని మోషన్ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. రోల్ రిడా పాడిన సాంగ్ మోషన్ పోస్టర్ కి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

‘హుషారు’ అనే యూత్ ఫుల్ సినిమాతో దర్శకుడిగా సూపర్ హిట్ కొట్టి మంచి గుర్తింపు అందుకున్న హర్ష డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై యూత్ ఆడియన్స్ లో మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది.

ఆశిష్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ బిగ్ ఎస్సెట్ కానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై దిల్ రాజు , శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read ‘వకీల్ సాబ్’ ఆడియో రివ్యూ

 

*Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics