Allu Arjun’s ‘Pushpa’ shooting in final stage !
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘పుష్ప (ది రైజ్)’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రెజెంట్ సినిమాలో బన్నీ మీద ఓ మాస్ సాంగ్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ‘దాక్కో -దాక్కో మేక’ , ‘శ్రీవల్లి’, ‘నా సామే’ పాటలు రిలీజై భారీ రెస్పాన్స్ తో పాటు మిలియన్ వ్యూస్ అందుకుంటున్నాయి. ఇప్పుడు అదే స్థాయిలో మరో సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఆ సాంగ్ షూట్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. దాదాపు వేయి మందికి పైగా డాన్సర్లతో భారీ స్థాయిలో ఈ సాంగ్ పిక్చరైజ్ చేస్తున్నారు.

ప్రేమ్ రక్షిత్ క్రియేటివ్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ సాంగ్ కి గణేష్ డాన్స్ మాస్టర్. ఈ సాంగ్ థియేటర్స్ లో మాస్ ఆడియన్స్ కి స్పెషల్లీ బన్నీ ఫ్యాన్స్ కి పూనకం తెప్పించేలా ఉంటుందని టాక్. దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ని భారీ స్థాయిలో షూట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సాంగ్ లో బన్నీ మాస్ స్టెప్స్ స్పెషల్ హైలైట్ అంటున్నారు.
ఈ సాంగ్ తో పాటు ఐటెం సాంగ్ ను కూడా రామోజీలోనే భారీ సెట్ వేసి షూట్ చేయబోతున్నారు మేకర్స్. ఐటెం సాంగ్ కోసం నార్త్ బ్యూటీ ని సెలెక్ట్ చేశారని సమాచారం. ఇక ఈ నెలాఖరుతో ప్యాచ్ వర్క్ కూడా ఫినిష్ చేసి టోటల్ షూట్ కి గుమ్మడికాయ కొట్టేస్తారు. అక్కడి నుండి ప్రమోషన్స్ మొదలు పెట్టి సినిమాపై ఇంకా అంచనాలు పెంచే ప్లానింగ్ లో ఉన్నారు. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఫహాద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్నాడు. సునీల్, రావు రమేష్ , అనసూయ , జగదీశ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై నవీన్ యర్నేని , రవి శంకర్ నిర్మిస్తున్నారు.
Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics